మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా పని చేసిన శివాజీరాజా, నరేష్ లు ప్రత్యర్దులుగా
ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు.

ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుండి హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో మా ఎన్నికలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శివాజీ రాజా ప్యానెల్ డబ్బులు పంచుతున్నారని నరేష్ సంచలన కామెంట్స్ చేశారు. అలా చేయడం బాధాకారమని అన్నారు.

శివాజీ ప్యానెల్ కి మద్దతు ప్రకటించిన నటుడు పృధ్వీరాజ్.. నరేష్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

ఆయన మాట్లాడుతూ..  ''సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నామే తప్ప.. మరో ఉద్దేశం లేదు.. మందు పోయించామని అంటున్నారు.. అలాంటి నీచమైన పనులు ఎవరూ చేయరు. క్రెడిబిలిటీ ఉన్న ప్యానల్ శివాజీరాజా ప్యానెల్. సాయంత్రం 5 గంటలకు చూడండి మేమే గెలుస్తాం'' అంటూ నమ్మకంగా చెబుతున్నారు పృధ్వీ.