MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నా సురక్షితంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాం.. సీఎం రేవంత్ రెడ్డి

ఒకవైపు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నా సురక్షితంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాం.. సీఎం రేవంత్ రెడ్డి

గద్దర్ అవార్డ్స్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను భారతీయ సినిమాకి కేంద్రంగా అభివర్ణించారు. తెలుగు సినిమాకు ప్రోత్సాహంగా గద్దర్ అవార్డ్స్ పునఃప్రారంభించామని, షూటింగ్ అనుమతులు ఆన్లైన్‌లో ఇస్తామని తెలిపారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 20 2026, 12:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
CM Revanth Reddy
Image Credit : Asianet News

CM Revanth Reddy

హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ గుర్తింపు గురించి మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ అంటే బిర్యానీ, ఐటీ, ఫార్మా కంపెనీలకే పరిమితం కాదని, భారతీయ సినిమాకు కేంద్రంగా కూడా నిలుస్తోందని పేర్కొన్నారు. దేశ సినీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
దర్శకుడు దాసరి నారాయణరావు చేసిన సేవలు
Image Credit : Asianet News

దర్శకుడు దాసరి నారాయణరావు చేసిన సేవలు

తెలుగు సినిమా అభివృద్ధికి గతంలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన స్మరించారు. తెలుగు సినిమా పెద్దగా ఉన్నప్పుడు అనేక సమస్యలను దాసరి పరిష్కరించారని తెలిపారు. పరిశ్రమకు మార్గదర్శకుడిగా ఆయన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. సినీ రంగ అభివృద్ధిలో ఆయన కృషి విశేషమని కొనియాడారు.

Related Articles

Related image1
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తర్వాత చిరంజీవి మరో సంచలన నిర్ణయం..ఆ హీరో స్ఫూర్తితోనే, అలాంటోడు ఒక్కడుంటే చాలు
Related image2
Gaddar Awards: సినిమాని ప్రోత్సాహించడంలో ఏపీ వెనుకబడింది, చంద్రబాబుకి చిరంజీవి రిక్వస్ట్.. షాకింగ్ కామెంట్స్
35
దేశ స్థాయిలో తెలుగు సినిమాలు
Image Credit : Asianet News

దేశ స్థాయిలో తెలుగు సినిమాలు

దేశ స్థాయిలో తెలుగు సినిమాలు సాధించిన విజయాలను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాలు జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందాయని తెలిపారు. ఈ విజయాలు తెలుగు సినిమా ప్రతిష్ఠను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయని పేర్కొన్నారు. భారతీయ సినిమాకు తెలుగు చిత్రాలు బలమైన గుర్తింపును తీసుకువచ్చాయని అన్నారు.

45
నంది అవార్డ్స్‌ను గద్దర్ అవార్డ్స్ పేరుతో
Image Credit : Asianet News

నంది అవార్డ్స్‌ను గద్దర్ అవార్డ్స్ పేరుతో

తెలుగు సినిమాను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను గద్దర్ అవార్డ్స్ పేరుతో తిరిగి ప్రారంభించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆ బాధ్యతను నెరవేర్చాల్సిన కర్తవ్యం తనపై ఉందని పేర్కొన్నారు. జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలు ప్రతిభను ప్రోత్సహించడంవల్లే అభివృద్ధిలో ముందున్నాయని ఉదాహరణగా తెలిపారు.

55
షూటింగ్ అనుమతుల ప్రక్రియ
Image Credit : Asianet News

షూటింగ్ అనుమతుల ప్రక్రియ

సినిమా షూటింగ్ అనుమతుల ప్రక్రియను సులభతరం చేసే చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. అనుమతుల కోసం కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ విధానంలోనే అనుమతులు లభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భద్రతా పరిస్థితులపై మాట్లాడుతూ, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న సమయంలో కూడా హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ప్రాంతాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Drishyam 3: కరుప్పు రికార్డులు బద్దలు కొట్టిన దృశ్యం 3.. మోహన్‌లాల్‌ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ
Recommended image2
Kangana Ranaut: మెడలో మంగళసూత్రంతో ప్రభాస్ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి చేసుకుందా?
Recommended image3
Arasan: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన శింబు..బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ
Related Stories
Recommended image1
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ తర్వాత చిరంజీవి మరో సంచలన నిర్ణయం..ఆ హీరో స్ఫూర్తితోనే, అలాంటోడు ఒక్కడుంటే చాలు
Recommended image2
Gaddar Awards: సినిమాని ప్రోత్సాహించడంలో ఏపీ వెనుకబడింది, చంద్రబాబుకి చిరంజీవి రిక్వస్ట్.. షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved