మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరుగుతోందని అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న నటుడు నరేష్ వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన 'మా' ఎన్నికల్లో అత్యధికంగా 423 నుండి 433 ఓట్లు పోలయ్యాయని కానీ ఈసారి రికార్డు స్థాయిలో ఓట్లు పోలవుతున్నాయని చెప్పారు.

ఎన్నికల అధికారులు పోలింగ్ సంఖ్య 450 దాటి 500 వైపు వెళ్తోందని చెప్పినట్లు వెల్లడించారు. ఇది ఆల్ టైం రికార్డ్ పోలింగ్ అని.. ఈ రేంజ్ లో పోలింగ్ జరుగుతుందంటే మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.

ఎవరు గెలిచినా.. ఇదొక మార్పు కోసం జరుగుతున్న పోలింగ్ అని స్పష్టం చేశారు.  గత ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా పని చేసిన శివాజీరాజా, నరేష్ లు ప్రత్యర్దులుగా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

శివాజీ ప్యానెల్ డబ్బులు పంచుతున్నారు: నరేష్!

'మా' ఎన్నికల్లో ఓటేసిన సినీ ప్రముఖులు!

'మా' ఎన్నికల పోలింగ్ షురూ!