ప్రముఖ దర్శకురాలు, నటి నందితా దాస్ తండ్రి పెయింటర్ జతిన్ దాస్ పై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నిషా బోరా అనే మహిళ మంగళవారం జతిన్ పై ఆరోపణలు చేసింది. తనకు 14 ఏళ్ల వయసులో ఆయన వేధించారని సంచనలన కామెంట్స్ చేసింది.

దీనిపై స్పందించిన జతిన్.. ఆమె ఎవరో తనకు తెలియదని, ఎప్పుడు చూసినట్లు కూడా లేదని, ఒకవేళ ఆమెను ఏ సంధర్భంలోనైనా కలిసి ఉన్నా అలా ప్రవర్తించి ఉండనని జతిన్ దాస్ చెప్పుకొచ్చారు. మీటూ పేరుతో కొందరు నిజాలు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఆడుకుంటున్నారని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజాగా తన తండ్రిపై వస్తోన్న ఆరోపణలపై నందితా దాస్ స్పందించింది. 'మీటూ ఉద్యమానికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. కానీ నా తండ్రి మీద ఇబ్బందికర ఆరోపణలు చేశారు. వాటిని ఆయన ఖండించారు.
మహిళలు, పురుషులు మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైమ్. వారు చెప్పే విషయాలను మనం కూడా వినాలి. అయితే ఆరోపణలు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించకూడదు' అని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!
14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!
సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!
నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు
నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!
ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!