నందమూరి బాలకృష్ణ వారుసుడి తెరంగేట్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఈ తరం వారసుడిగా ఎన్టీఆర్‌ వెండితెరకు పరిచయం అయినా బాలయ్య అభిమానులు మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బాలయ్య 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణితో మోక్షజ్ఞ తెరకు పరిచయం అవుతాడన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

కానీ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు చిత్రయూనిట్. తరువాత కూడా చాలా సందర్భాల్లో బాలయ్య వారసుడి ఎంట్రీపై వార్తలు వినిపించాయి. కానీ ఇటీవల బయటకు వచ్చి మోక్షజ్ఞ ఫోటోలు చూస్తే ఇప్పట్లో వెండితెర అరంగేట్రం జరిగే అవకాశమే లేదని భావించారు ఫ్యాన్స్. భారీ కాయంతో కనిపించిన మోక్షు లుక్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి.

తాజాగా మరోసారి బాలయ్య వారసుడి ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నందమూరి వారసుడి ఎంట్రీ కోసం సాయి మాధవ్‌ బుర్రా స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేసే పనిలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు.