బిగ్‌బాస్‌4 రెండో వారంలో ఇద్దరు ఎలిమినేట్‌ అవుతారని శనివారం నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. శనివారం మొదటి ఎలిమినేషన్‌గా కరాటే కళ్యాణిని పంపించారు. ఆమె పోతూ పోతూ మూడో వారంలో దేవి నాగవల్లిని నామినేట్‌ చేసి బిగ్‌బాంబ్‌ పేల్చి వెళ్ళింది. 

ఇక రెండో వారం రెండో ఎలిమినేషన్‌పై ఆద్యంతం ఉత్కంఠ నెలకొంది. ఏడుగురు నామినేషన్‌ సభ్యుల్లో ఎవరు సేఫ్‌ అనేదానిపై గేమ్‌లు జరిగాయి. బెలూన్స్ ద్వారా అభిజిత్‌, కుమార్‌ సాయి సేఫ్‌ అయ్యారు. అమ్మ రాజశేఖర్‌, హారిక, నోయల్‌, మెహబూబ్‌, సోహైల్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. `బోన్‌ గేమ్‌` మధ్యలో మిర్చీ తిన్న అమ్మ రాజశేఖర్‌ సేఫ్‌ అంటూ పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు నాగ్‌. 

ఇక మిగిలిన వారి ఎలిమినేషన్‌ తాళపత్రం ద్వారా సోహైల్‌, నోయల్‌ సేఫ్‌ అని దేవి చెప్పింది. మిగిలిన మోనాల్‌ గజ్జర్‌, దేత్తడి హారిక మధ్య చివరి నిమిషం వరకు గేమ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఎవరు ఉంటారు, ఎవరు పోతారో అని. నామినేషన్‌ కాని ఏడుగురు వీరిద్దరు ఎవరికి మద్దతు పలుకుతున్నారో చెబుతూ వాటర్‌ పోయాల్సి ఉంది. ఆరుగురు వరకు ఇద్దరికీ సేమ్‌ వచ్చాయి. చివరగా సుజాత.. హారికని ఎలిమినేషన్‌కి సిఫార్సు చేయగా, ఆమెని ఇంటిసభ్యులందరూ కలిసి పంపించేందుకు రెడీ అయ్యారు. 

అయితే తాను ఎలిమినేట్‌ కావడంపై హారిక కన్నీళ్ళు పెట్టుకుంది. అదే సమయంలో తాను చివరి నిమిషంలో బయటపడంతో మోనాల్‌ ఎమోషనల్‌ అయిపోయింది. హారికని పంపించే విషయంలో సభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు. గేట్‌ తెరచి హారిక వెళ్ళేలోపు చివరి క్షణంలో బిగ్‌బాస్‌ `హారిక స్టాప్‌` అని చెప్పేశాడు. ఆమెని ఎలిమినేట్‌ చేయడం లేదని ప్రకటించాడు. దీంతో సభ్యులంతా సంతోషంతో ఎగిరి గంతేశారు. 

అయితే నాగ్‌ ఈ టెస్ట్ పెట్టడానికి కారణం సెల్ఫ్‌ నామినేషన్‌ అని, ఎవరూ సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకోకూడదని, ఇక్కడికి వచ్చింది ఆడటానికి, వెళ్ళిపోవడానికి కాదని, ఈ అవకాశం రావడం గొప్ప విషయమని గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఇదొక వార్నింగ్‌ అని, ఇకపై ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆడాలని స్పష్టం చేశారు. దీంతో సభ్యులంతా ఊపిరిపీల్చుకున్నారు.