Asianet News TeluguAsianet News Telugu

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ప్రకటన వెనుక క్రిష్

  • నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య క్లారిటీ
  • త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై మోక్షజ్ఞ కనిపిస్తాడన్న బాలయ్య
  • హిందూపురంలో అభిమానుల మధ్య మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు
mokshagna tollywood entry confirmed

నందమూరి ఫ్యామిలీ నంచి అభిమానులంతా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. చాలా కాలంగా ఊరిస్తున్న మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయిందని... వచ్చేఏడాది జూన్‌ లో మోక్షజ్ఞ మూవీ ప్రారంభం ఆవుతుందని స్వయంగా బాలకృష్ణ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పటికే యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న మోక్షజ్ఞ మార్చినాటికి పూర్తికావచ్చని భావిస్తున్నారు.

 

బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో బుధవారం మోక్షజ్ఞ 24వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ కేక్ కట్ చేసిన బాలయ్య.. మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ వివరాలు వెల్లడించారు. అభిమానులే తమకు రక్ష అని, తనను ఆదరించిన విధంగానే తన కొడుకుని కూడా ఆదరించాలని అభిమానులను కోరాడు బాలయ్య. 

 

ఈమూవీకి దర్శకుడు ఎవరు అన్నది ప్రస్తుతానికి బయటకు రాకపోయినా క్రిష్ మోక్షజ్ఞను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సమయంలోనే  డైరక్టర్ క్రిష్ ఒక సబ్జెక్ట్ చెప్పడం దాన్ని బాలయ్య ఓకె చేయడంతో క్రిష్ ఇప్పుడు ఆ కథను డెవలప్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

ఎలాంటి హైప్ క్రియేట్ చేయకుండా.. ఒక సింపుల్ లవ్ స్టోరీతో మోక్షజ్ఞను టాలీవుడ్ కు పరిచయం చేయాలని భావిస్తున్న నేపథ్యంలో క్రిష్ చెప్పిన సింపుల్ లవ్ స్టోరీ బాలకృష్ణకు బాగా నచ్చినట్లు టాక్. అయితే క్రిష్ మరీ ఎగ్జయిటింగ్ స్క్రిప్ట్ లు తయారుచేసే దర్శకుడు కాదు కాబట్టి మొదటి సినిమాతోనే సంచలనాలు ఆశిస్తున్న నేటితరం ప్రేక్షకులకు క్రిష్ మోక్షజ్ఞ ఎంట్రీని ఏ విధంగా మెప్పించగలడు అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే క్రియేటివ్ దర్శకుడుగా పేరుగాంచిన క్రిష్ ‘గమ్యం’ ‘వేదం’ ‘కంచె’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి సినిమాలు తీసినా ఆసినిమాలు ఏమి బ్లాక్ బస్టర్ హిట్స్ కావు. తెలుస్తున్న సమాచారం మేరకు క్రిష్ మోక్షజ్ఞతో తీయబోతున్నది ఈకాలం ఫాస్ట్ లవ్ మాదిరిగా కాకుండా, ఫీల్ లవ్ అనే టైపు సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ కు మ్యూజిక్ కూడా కీలకంగా వుంటుందని టాక్. ఒక విధంగా బాలయ్య నేటి ట్రెండ్ కు వ్యతిరేకంగా క్రిష్ తో మోక్షజ్ఞ పై భారీ ప్రయోజనమే చేస్తున్నట్లు అనిపిస్తోంది. మరి వస్తున్న ఈవార్తలలో ఎన్ని వాస్తవాలో చూడాలి..  

Follow Us:
Download App:
  • android
  • ios