Asianet News TeluguAsianet News Telugu

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప్రీ రిలీజ్‌ ఈవెంట్ డేట్ ఫిక్స్‌, ఎప్పుడు..? ఎక్కడా..?

ఎట్టకేలకు మాచర్ల నియోజకవర్గం మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రిలీజ్ డేట్ కోసం ఉరకలేస్తున్న ఈ సినిమా  ముందస్తు వేడుకకు టైమ్ డేట్ తో పాటు అనౌన్స్ చేశారు మేకర్స్. 
 

Macherla Niyojakavargam Pre Release Event Date and Time
Author
Hyderabad, First Published Aug 6, 2022, 9:29 PM IST

సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న నితిన్.. ఈసారి పవర్ ఫుల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఫ్యాక్షన్ స్టోరీతో నితిన్ నటించిన సినిమానే మాచర్ల నియోజక వర్గం ఈ మూవీ రిలీజ్ కు అంతా రెడీ అయ్యింది. అంతకంటే ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రెడీ అవుతున్నారు టీమ్. డేట్ టైమ్ తో సహా అనౌన్స్ చేశారు మేకర్స్. 

యంగ్ హీరో నితిన్  హీరోగా,  ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా  హీరోయిన్ లుగా న‌టించిన‌ సినిమా మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ ఈసినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఎప్పుడూ లవ్ స్టోరీస్ లేదంటే ప్యామిలీ స్టోరీస్ తో సందడి చేసే నితిన్... ఈసారి కంప్లీట్ గా తన జానర్ మార్చేసి.. కంప్లీట్  యాక్ష‌న్ రోల్‌ను పోషించాడు. ఈనెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. ఇక ప్రమోషన్లతో అదరగొడుతుంది టీమ్.. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ టైమ్ ను అనౌన్స్ చేశారు టీమ్. 

 

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆగ‌స్టు 7న హైద‌రాబాద్‌లో జ‌రుప‌నున్న‌ట్లు మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే గుంటూరులో గ్రాండ్‌గా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ను జ‌రిపిన విషయం తెలిసిందే. నితిన్ ఈ సినిమాలో గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.   ఇప్ప‌టికే మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం  నుండి విడుద‌లైన ప్రమోషన్ వీడియోలు, ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలకు క్రియేట్ చేశాయి. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా నుంచి మూవీ టీమ్ వ‌రుస అప్‌డేట్‌ లను రిలీజ్ చేస్తూ..  సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. 

అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిదిగా ఎవరిని పిలుస్తున్నారు అన్నవిషయంలోక్లారిటీ రాలేదు. ఇక  ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈసినిమాకు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు ఎడిటర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు కాగా.. సినిమాటోగ్ర‌ఫి ప్ర‌సాద్ మూరెళ్ళ‌ అందించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios