సౌత్‌లో టాప్‌ స్టార్లందరి సరసన నటించిన అందాల భామ నయనతార. హీరోయిన్ ఎంతటి స్టార్ ఇమేజ్‌ ఉందే అదే స్థాయిలో వివాదాస్పదమైంది ఈ బ్యూటీ. ముఖ్యంగా రిలేషన్‌ షిప్‌ల విషయంలో తరుచూ వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. కెరీర్‌ స్టార్టింగ్‌లో శింబుతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ తరువాత ప్రభుదేవాతో పెళ్లి పీటల వరకు వెళ్లింది. కానీ చివరి నిమిషంలో ఈ ఇద్దరు బ్రేకప్‌ చెప్పేసుకొని దూరమయ్యారు.

ఆ తరువాత కొంత కాలం సినిమాల మీదే దృష్టి పెట్టిన ఈ బ్యూటీ కొంత కాలంగా యువ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో డేటింగ్ చేస్తోంది. అయితే వీరి రిలేషన్‌పై తరుచూ వార్తలు వస్తుండటంతో ఇక ఆ గాసిప్స్‌కు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని నిర్ణయించుకున్నారట నయన్‌, విఘ్నేష్‌లు. అందుకే త్వరలోనే వీరు పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై నయన్‌, విఘ్నేష్‌లు స్పందించకపోవటంతో నిజమే అని భావిస్తున్నారు.

తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ తెర మీదకు వచ్చింది. నయన్‌ తన పెళ్లి వేడుకను నిరాడంబరంగా చేసుకోవాలని ప్లాన్ చేస్తుందట. అంతేకాదు హిందూ సాంప్రదాయం ప్రకారం, క్రిస్టియన్‌ సాంప్రదాయం ప్రకారం రెండు పెళ్లిల్లు చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే రెండు వివాహాలకు కూడా అత్యంత సన్నిహితులను తప్ప ఎవరినీ ఆహ్వానించ కూడాదని కూడా ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఈ వార్తలపై నయన్‌, విఘ్నేష్‌లు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి అసలు నిజమేంటో తెలియాలంటే మాత్రం కొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే. ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉంది.