కన్నడ సూపర్ హిట్  KGF  సినిమా ఫ్యాన్స్ కు ఇది ఓ రకంగా  శుభవార్త  . పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ చిత్రం సీక్వెల్ ఈ సంవత్సరం  తెరపైకి రావటానికి రంగం రెడీ అవుతోంది. అందులో భాగంగా ఈ చిత్రం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. ఈ చిత్రం టీజర్ విడుదలకు టైమ్ ఫిక్స్ చేసారు.  ఈ సినిమా టీజర్ జ‌న‌వ‌రి 8న   ఉద‌యం 10.18ని.ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ కొద్దిసేప‌టి క్రితం ప్ర‌క‌టించారు.  టీజ‌ర్ కోసం భాషా భేధం లేకుండా దేశమంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది. 

`కేజీఎఫ్`కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇటీవలె క్లైమాక్స్ సన్నివేశాలను భారీగా షూట్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
  
 కేజీఎఫ్: చాప్టర్ 2 మరోసారి కల్ట్ రాకీ పాత్రలో యష్‌ చేస్తున్నారు. సంజయ్ దత్ పోషించిన అధీరా రూపంలో అతను ఈసారి పెద్ద థ్రెట్ ఎదుర్కొ బోతున్నాడు. శ్రీనిధిశెట్టి, ప్రకాష్‌రాజ్‌, ఆనంత్‌నాగ్‌, రావు రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  బ‌స్రూర్ సంగీతం అందిస్తున్నారు. అతి త్వరలోనే విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ ఎనౌన్సమెంట్  కోసం వేచి చూద్దాం.