పదమూడేళ్ల క్రితం ఆదిత్య పంచోలి తనను మానసికంగా, లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తగా ఆదిత్య.. కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం ఈ కేసు పరిశీలనలో ఉంది. ఇది ఉండగా.. ఆదిత్య పంచోలి భార్య జరీనా మాత్రం తన భర్త ఎలాంటితప్పు చేయలేదని అంటోంది. ఆయన గురించి తనకంటే బాగా ఎవరికీ తెలియదని, తన నుండి ఏ విషయం దాచేవారు కాదని జరీనా చెప్పుకొచ్చింది. 

గతంలో కంగనా, ఆదిత్యల విషయంలో ఏం జరిగిందో తనకు తెలుసునని చెప్పింది. పెళ్లైన వ్యక్తితో ఏళ్ల తరబడి డేటింగ్ చేసి, తీరా విడిపోయిన తరువాత అత్యాచారం చేశాడంటే ఎలా..? అంటూ పరోక్షంగా కంగనాపై ఆరోపణలు చేసింది.

ఆమె చేసిందంతా తప్పంటూ కంగనాపై విమర్శలు చేసింది. కంగనాకి ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కాదు.. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి!