Asianet News TeluguAsianet News Telugu

నా ఆరోపణలు తప్పు అంటే అవార్డులు వెనక్కి ఇచ్చేస్తాః కంగనా రనౌత్‌

స్వరా భాస్కర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా కంగనా రనౌత్‌ స్పందించారు. కంగనా విత్‌ అర్నాబ్‌ గోస్వామి చాట్‌లో మాట్లాడుతూ, `సుశాంత్‌ కేసు విషయంలో తాను చేసిన ఆరోపణలు తప్పు అయితే నిజంగానే ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను తిరిగి ఇస్తాన`ని స్పష్టం చేసింది. 

kangana ranaut react on swara bhasker comments arj
Author
Hyderabad, First Published Oct 8, 2020, 8:51 AM IST

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో తాను చేసిన ఆరోపణలు తప్పు అయితే తన అవార్డులు తిరిగి ఇచ్చేస్తానని బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ అన్నారు. తాను చేసిన కామెంట్లకి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసింది. 

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తికి బుధవారం బాంబే హైకోర్ట్ బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో రియాపై ఆరోపణల్లో బలమైన ఆధారాలు లేవంటూ కోర్ట్ బెయిల్‌ ఇచ్చింది. దీంతోపాటు ఎయిమ్స్ కూడా సుశాంత్‌ది హత్య కాదు, ఆత్మహత్యనే అని తేల్చింది. 

ఈ నేపథ్యంలో సుశాంత్‌ని హత్య చేశారు, ఇందులో రియా హస్తం ఉందనే ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. దీంతో తాజాగా నటి స్వరభాస్కర్‌ స్పందించారు. ఓ ఛానెల్‌లో ఆమె మాట్లాడుతూ, సిబిఐ, ఎయిమ్స్ సుశాంత్‌ది ఆత్మహత్యనే అని స్పష్టం చేశాయి. కొంత మంది ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తిరిగి ఇవ్వబోతున్నారా?` అని ప్రశ్నించింది స్వరా.

స్వరా భాస్కర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా కంగనా రనౌత్‌ స్పందించారు. కంగనా విత్‌ అర్నాబ్‌ గోస్వామి చాట్‌లో మాట్లాడుతూ, `సుశాంత్‌ కేసు విషయంలో తాను చేసిన ఆరోపణలు తప్పు అయితే నిజంగానే ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను తిరిగి ఇస్తాన`ని స్పష్టం చేసింది. గతంలో కంగనా.. సుశాంత్‌ కేసులో, బాలీవుడ్‌లో నెపోటిజం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని తాను చేసిన ఆరోపణలు నిజం కాకపోతే .. తాను రామ భక్తురాలిని అని, కేంద్రం ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. 

ఇక బుధవారం బాంబే హైకోర్ట్ రియా చక్రవర్తికి బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్‌పై రియాకు బెయిల్‌ ఇచ్చారు. ఆమె సోదరుడు షోయిక్‌, అబ్డేల్‌ బాసిత్‌ పరిహర్‌కి బెయిల్‌ పిటిషన్‌ని నిరాకరించింది. వీరితోపాటు సుశాంత్‌ వంటమనిషి దీపేష్‌ సావత్‌, సామ్యూల్‌ మిరాండలకు సైతం యాభై వేల పూచికత్తుపై బెయిల్‌
ఇచ్చింది 

ముంబయిలోని డ్రగ్‌ మాఫియాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో సెప్టెంబర్‌8న సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె సోదరుడు సోయిక్‌ని సెప్టెంబర్‌ 4న అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఆ సమయంలోనే రియా ప్రత్యేక కోర్ట్ తన బెయిల్‌ కోసం పిటిషన్‌ పెట్టుకోగా, కోర్ట్ తిరస్కరించింది. అంతేకాదు ఆమెపై కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించింది.

ఈ నేపథ్యంలో రియా బాంబే హైకోర్ట్ ని ఆశ్రయించింది రియా. వాదోపవాదనల అనంతరం లక్ష రూపాయల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ని మంజూరు చేసింది హైకోర్ట్.  సుశాంత్‌ కేసులో రియా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో బాలీవుడ్‌ డ్రగ్స్ కేసులోనూ ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో ఎన్‌సీబీ ఆమెని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios