రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. బాహుబలి తర్వాత దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. 1920 బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఇద్దరు స్వాతంత్ర ఉద్యమవీరుల పాత్రలతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కల్పిత గాధగా చిత్రీకరిస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ చిత్రంలో విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారు. 

ఎన్టీఆర్ కొమరం భీంగా మారేందుకు సన్నబడుతున్నాడు. ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ అభిమానులని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అరవింద సమేత చిత్రంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ బాగా బరువు తగ్గి కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ లుక్, మీసకట్టు దాదాపుగా కొమరం భీంని పొలిఉన్నాయని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ని రాజమౌళి ఇంకా ఖరారు చేయలేదు. చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.