Asianet News TeluguAsianet News Telugu

శ్రోతలని అలరిస్తున్న `పడిపోయా` ఇండిపెండెంట్‌ సాంగ్‌.. ట్రెండింగ్‌

`పడిపోయా` అనే ఇండిపెండెంట్‌ సాంగ్‌ ఆదిత్య మ్యూజిక్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా గత వారం విడుదలై  విశేష స్పందన రాబట్టుకుంటుంది.

independent song padipoya trending in youtube celebrities fidaa
Author
Hyderabad, First Published Aug 6, 2022, 2:19 PM IST

యూట్యూబ్, మ్యూజిక్‌ సంస్థల సహకారంతో ఇండిపెండెంట్స్ సాంగ్‌ ట్రెండ్‌ ఊపందుకుంది. పాపులర్‌ పాప్ సింగర్స్ మాత్రమే కాదు, అప్‌కమింగ్‌ మ్యూజిషీయన్లు కూడా ఇండిపెండెంట్‌ సాంగ్స్ చేస్తూ తమ ప్రతిభని చాటుతున్నారు. తామెంటో నిరూపించుకుంటున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్లుగా, సింగర్స్ గా రాణించాలనుకునే వారికిది విజిటింగ్‌ కార్డ్ లా పనిచేస్తుంది. అందులో భాగంగానే యంగ్‌ మ్యూజీషియన్లు మ్యూజిక్‌ డైరెక్టర్‌ వెంకటేష్‌ ఉప్పాల, సింగర్‌ సుమంత్‌ బొర్ర మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ ఇద్దరు కలిసి లేటెస్ట్ గా `పడిపోయా` అనే ఇండిపెండెంట్‌ సాంగ్‌ని రూపొందించారు. 

ఆదిత్య మ్యూజిక్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా గత వారం విడుదలైన ఈ పాటకి విశేష స్పందన లభిస్తుంది. శ్రోతలను అలరిస్తుంది. యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో తమ ఆనందాన్ని పంచుకున్నారు సంగీత దర్శకుడు, నిర్మాత వెంకటేష్‌ ఉప్పల, సింగర్‌ సుమంత్‌ బొర్ర. వెంకటేష్‌ ఉప్పాల మాట్లాడుతూ, లవ్లీ ప్రొఫేషనల్‌ యూనివర్సిటీలో ఒక బ్యాండ్‌ ఏర్పాటు చేసిన సమయంలో సుమంత్‌ పరిచయమైనట్టు తెలిపారు. అప్పట్నుంచి కలిసి జర్నీ చేస్తున్నామని చెప్పారు. 

ఇద్దరూ కలిసి 2014లో ఓ ప్రాజెక్ట్ కూడా చేశారట. అందులో `ఏలా మరి ఇక రావా` పాట మంచి గుర్తింపు తెచ్చిందన్నారు. ఇప్పుడు `పడిపోయా` అనే పాట మరింత గుర్తింపుని తెచ్చిందని తెలిపారు. ఈ పాటతో శ్రోతలని విశేషంగా అలరిస్తుందని, ఈ పాటకి మెహర్‌ రమేష్‌, తరుణ్‌ భాస్కర్‌, గీతా భాస్కర్‌, గాయకుడు దీపు వంటి చాలా మంది సెలబ్రిటీలు ఫిదా అయ్యారని చెప్పారు. 

సింగర్‌ సుమంత్‌ బొర్రా చెబుతూ, తెలుగు, దక్షిణాది సంగీతానికి పాశ్చాత్య టచ్‌ని తీసుకురావాలనే స్పష్టమైన లక్ష్యంతో మ్యూజిక్‌ రంగంలోకి అడుగుపెట్టినట్టు తెలిపారు. రొటీన్‌కి భిన్నమైన సంగీతాన్ని అందించాలని సంగీత దర్శకుడు వెంకటేష్‌ తపిస్తారని పేర్కొన్నారు. మూడేళ్లుగా ఆదిత్య మ్యూజిక్‌ సంస్థతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ఈ పాటని ఆదరించిన శ్రోతలకు ధన్యవాదాలు తెలిపారు. `పడిపోయా` పాటకి మల్లిక వల్లభ సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ పాటలో ఉపేంద్ర కుమార్‌,వైష్ణవి రెడ్డి లీడ్‌ పెయిర్‌గా నటించారు. శివారెడ్డి సినిమాటోగ్రఫి అందించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios