తెలుగు ప్రేక్షకులకు ఇలియానా గురించి పరిచయం అవసరం లేదు. దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరితో యువత కలల రాణిగా మారిపోయింది.

తెలుగు ప్రేక్షకులకు ఇలియానా గురించి పరిచయం అవసరం లేదు. దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత పోకిరితో యువత కలల రాణిగా మారిపోయింది. పోకిరి తర్వాత ఇలియానా టాలీవుడ్ లో సునామి సృష్టించింది అనే చెప్పాలి. స్టార్ హీరోలతో కలసి ఆడిపాడింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కొంతకాలం పాటు ప్రేమ వ్యవహారాలు వాటి ఫలితంగా ఎదురైనా ఇబ్బందులతో ఇలియానా సతమతమయింది. డిప్రెషన్ నుంచి తిరిగి కోలుకున్న ఇలియానా సీక్రెట్ గా ఫారెన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తాను గర్భవతిని అని ప్రకటించే వరకు ఇలియానా పెళ్లి చేసుకుందా అని ఎవరికీ తెలియదు. 

ఇలియానా గత ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇలియానా తన భర్త, కొడుకుతో సంతోషంగా గడుపుతోంది. ఇలియానా తన కొడుక్కి కోవా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టింది. తరచుగా ఇలియానా తన కొడుకు క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. 

View post on Instagram

ఇప్పుడు ఏకంగా వీడియో క్యూట్ గా మురిపిస్తున్న వీడియో పోస్ట్ చేసేసింది. ఈ వీడియోలో ఇలియానా కొడుకు ముద్దులొలికించే విధంగా ఉన్నాడు. అల్లరి చేస్తూ జలకాలాడుతూ ఉన్నాడు. సెలబ్రిటీలు సైతం ఇలియానా కొడుకు క్యూట్ నెస్ కి ఫిదా అవుతున్నారు. ఈ వీడియోతో ఇలియానా కొడుకు సోషల్ మీడియాలో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.