Asianet News TeluguAsianet News Telugu

కవల పిల్లలను కన్న హీరోయిన్ నమిత, సంతోషంలో మునిగితేలుతున్న నటి.

సౌత్ లో హాట్ హీరోయిన్ గా పేరున్ననమిత తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. రీసెంట్ గా కవల పిల్లలకు జన్మనిచ్చింది నమిత. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది బ్యూటీ. 
 

Heroine Namitha Gave Birth to twins
Author
Hyderabad, First Published Aug 20, 2022, 7:46 AM IST

వెంకటేష్ హీరోగా వచ్చిన జెమిని సినిమాతో టాలీవుడ్ లో తేరంగేట్రం చేసింది నమిత. వెంటనే ఆర్య రాజేశ్ హీరోగా  నటించిన సొంతం.. సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది. ఇక వరుసగా టాలీవుడ్ లో  ఒక రాజు ఒక రాణి లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. బాగా బొద్దుగా తయారయిన ఈ ముద్దుగుమ్మ... తమిళ ఆడియన్స్ కు ఆరాథ్య దేవతగామారిపోయింది. నమితకు అక్కడ గుడి కట్టారంటే ఆమకున్న ఫాలోయింగ్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇక  ఆ మధ్యలో సినిమలకు కాస్త గ్యాప్ తీసుకున్న బ్యూటీ..  బాలయ్యతో సింహా సినిమాలో నటించింది. 

తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది బ్యూటీ.  అయితే నమిత కొద్దిగా బొద్దుగా మారడంతో తమిళంలో తప్పించి ఆమెకు మిగతా భాషల్లో  సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.  2017లో తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది నమిత. ఆతరువాత ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయ్యింది. ఇక రీసెంట్ గా  ఈ అమ్మడు అభిమానులకు ఓ సంతోషకరమైన వార్త పంచుకుంది. తాను పండంటి ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చినట్టు తెలిపింది. ఈ విషయాన్నే తన ఇన్ స్టా లో షేర్ చేసింది. 

ట్వీన్స్ కలిగారన్న ఆనందాన్ని తెలుపుతూ. ఈ విధంగా రాసింది నమిత. శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు ఈ శుభ వార్తను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల మాకు ట్విన్స్ పుట్టారు. వారికి మీ ఆశీర్వాదం కూడా కావాలి అంటూ.. పోస్ట్ పెట్టింది. అంతే కాదుతనను హస్పిటల్ లో చాలా బాగా చూసుకున్నందుకు ఆసుపత్రి మేనేజ్ మెంట్ కు.. అక్కడ స్టాఫ్ కు.. అలాగే డా. భువనేశ్వరీ, డా.ఈశ్వర్, డా. వెళ్లు మురుగన్ లకు చాలా థ్యాక్స్ హ్యాపీ జన్మాష్టమి అంటూ నమిత ఇన్ స్టాలో  వీడియో శేర్ చేసింది. 

 

అయితే  నమిత ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచీ.. వరుస ఫోటో షూట్స్ తో సందడి చేసింది. తన  బేబీ బంప్ ఫొటో షూట్స్ తో సందడి చేసింది. వరుస ఫోటోలను తన బ్లాగ్ లో షేర్ చేయగా అవి నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.ఇక తను ట్విన్స్ కు జన్మనిచ్చిందన్న సంతోషం లో ఫ్యాన్స్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వరుసగా కామెంట్లు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios