Asianet News TeluguAsianet News Telugu

కొడుకు ఆర్యన్ ఖాన్ కోసం జైలుకి వచ్చిన షారుక్!

నిన్న ఆర్యన్ ఖాన్ bail పిటీషన్ పై విచారణ జరుగగా, జడ్జి నిరాకరించారు. ఇప్పటికే రెండు సార్లు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ తిరస్కరించబడింది. 

hero shahrukh khan visits arthar jail in mumbi to meet son aryan khan
Author
Hyderabad, First Published Oct 21, 2021, 12:06 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నేడు ఉదయం హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ని జైలులో కలిశారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన ఆర్యన్ ఖాన్ ముంబై ఆర్థర్ జైల్లో ఉన్నారు. దీనితో షారుక్ ఆర్థర్ జైలుకి రావడం జరిగింది. దాదాపు 20నిముషాలు ఆర్యన్ ఖాన్ తో Shahrukh khan మాట్లాడినట్లు సమాచారం. షారుక్ రాకను తెలుసుకున్న మీడియా అక్కడ చేరుకోవడం జరిగింది. 


నిన్న ఆర్యన్ ఖాన్ bail పిటీషన్ పై విచారణ జరుగగా, జడ్జి నిరాకరించారు. ఇప్పటికే రెండు సార్లు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ తిరస్కరించబడింది. దాదాపు 20రోజులుగా ఆర్యన్ ఖాన్ జైలు జీవితం గడుపుతున్నారు. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్స్ ఆర్యన్ ఖాన్ తరపున వాదిస్తున్నా, ఆయనకు బెయిల్ రాకపోవడం విశేషం. 

Also read బ్రేకింగ్ : మళ్ళీ నిరాశే.. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిన కోర్టు
Aryan khan అరెస్ట్ లో రాజకీయ కోణం ఉందని భావిస్తున్న బాలీవుడ్ ప్రముఖులు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. నటుడు హృతిక్ రోషన్ తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు బహిరంగంగా ఆర్యన్ ఖాన్ నిర్దోషి అంటూ వాదిస్తున్నారు. 
అక్టోబర్ 3న ఆర్యన్ ఖాన్ ని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆర్యన్ ఖాన్ తన మిత్రులతో కలిసి క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీలో పాల్గొన్నాడని, ఈ పార్టీలో నిషేదిత డ్రగ్స్ ఉపయోగించారని ఎన్సీబీ అధికారుల అభియోగం. ఈ కేసు విచారణలో భాగంగా ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొందరిని అధికారులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 

Also read కొండా మూవీని ఎవరూ ఆపలేరు.. తెలంగాణా మంత్రికి వర్మ మాస్ వార్నింగ్!
కొడుకు అరెస్ట్ షారుక్ ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది.కనీసం ఆర్యన్ ఖాన్ కి బెయిల్ కూడా రాకపోవడం మరింత కృంగదీస్తుంది. దర్శకుడు అట్లీ తో షారుక్ చేస్తున్న లయన్ చిత్ర షూటింగ్ ని కూడా షారుక్ ఆపివేసి, కొడుకును బయటికి తీసుకువచ్చే పనుల్లో నిమగ్నమయ్యాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios