Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన హిరో అల్ల‌రి న‌రేష్

  • తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటున్న షో బిగ్ బాస్ 
  • ముగింపు ద‌శ‌కు చేరుకున్న బిగ్ బాస్ షో 
  • బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన హిరో అల్ల‌రి న‌రేష్ 
  • షోలో అమ్మ‌ని గుర్తుచేసుకుని బోరున ఎడ్చిన హ‌రితేజ‌
hero allari naresh enter into bigg boss house

 

 

బిగ్ బాస్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూ ముగింపు దశకు చేరుకున్నది. 50 రోజులకు పైగా అనేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. బుధవారం నాటి కార్యక్రమంలో పాఠశాల ఎపిసోడ్. అనాథ పిల్లలతో ఆటపాట కార్యక్రమం ఆకట్టుకున్నది. బిగ్ బాస్ కార్యక్రమంలో రోజు వారి పనుల్లో భాగంగా పాఠశాల ఎపిసోడ్ ను నిర్వహించారు.

 దీక్ష, హరితేజ ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. పాఠశాలలో పిల్లలుగా శివ బాలజీ, నవదీప్, ప్రిన్స్, ఆదర్శ్, అర్చన నటించారు.షోలో భాగంగా దీక్షా పంత్ లెక్కల టీచర్ గా వ్యవహరించింది. అయితే టీచర్ గా తన ప్రభావం చూపక పోగా, పిల్లల చేతలో నవ్వుల పాలైంది. నవదీప్ వేసిన సులభమైన ఫార్ములాను సాల్వ్ చేయకపోగా తికమకకు గురైంది.

బుధవారం బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలు కాకుండా అనాధ పిల్లలు వచ్చారు. ఇంటిలోని సెలబ్రిటీలు పిల్లలతో ఆడుకున్నారు. పిల్లలకు అర్చన మేకప్ వేసి అందంగా అలంకరించింది. పాఠశాల ఎపిసోడ్ లో సూపర్ మామ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో అమ్మ గురించి రాసి... తమ భావన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హరితేజ అమ్మను గుర్తు చేసుకొని భోరున ఏడ్చింది.

 ఒక్కసారి అమ్మను గురించిన సమాచారాన్ని అందించాలని బిగ్ బాస్ ను కొరింది.గురువారం నాటి ఏపిసోడ్ లో భాగంగా ఇంటిలోకి సినీనటుడు అల్లరి నరేష్ ప్రవేశించనున్నాడు. శుక్రవారం రిలీజ్ కానున్న మేడ మీద అబ్బాయి చిత్రం ప్రమోషన్ బిగ్ బాస్ హౌస్ లో చేపట్టనున్నారు. ఈ వేదికను అల్లరి నరేష్ తన సినిమా కోసం ఉపయోగించుకోవడం గమనార్హం.

ఇప్పటికే కొందరు హీరోలు తమ మూవీ ప్రమోషన్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోను ఎంచుకుంటున్నారు. ఇటీవల రానా, విజయ్ దేవరకొండ, తాప్సి తదితరులు కూడా ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఇవాళ తన సినిమా మేడ మీద అబ్బాయి ప్రమోషన్ కోసం బిగ్‌బాస్ షోలో అల్లరి నరేష్ సందడి చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios