MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Agnipariksha: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఫైనల్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లే కామనర్స్ వీళ్లే?

Agnipariksha: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఫైనల్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లే కామనర్స్ వీళ్లే?

బిగ్‌ బాస్‌ తెలుగు 10 వచ్చే ఆదివారం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కామనర్స్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 31 2026, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్‌ బాస్‌ ప్రోమో అదిరింది
Image Credit : JioHotstar

బిగ్‌ బాస్‌ ప్రోమో అదిరింది

బిగ్‌ బాస్‌ తెలుగు 10 త్వరలో స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించిన హడావుడి ప్రారంభమైంది. తెలుగు షోకి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా నలుగురు(తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) హోస్ట్ లతో కలిసి విడుదల చేసిన ప్రోమో ఆసక్తికరంగా సాగింది. నలుగురికి నాలుగు రకాల టిఫిన్స్ తీసుకొచ్చారు సర్వెంట్‌. మొదట వ్యతిరేకించి ఆ తర్వాత టేస్ట్ ని ఎంజాయ్‌ చేశారు. ఈ ప్రోమో బిగ్‌ బాస్‌ పై ఆసక్తిని పెంచింది. ఈ సారి షోలో కూడా అలాంటి సర్‌ప్రైజ్‌లు ఉంటాయనే విషయాన్ని వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బిగ్‌ బాస్‌ తెలుగు 10లోకి రాబోతున్న సెలబ్రిటీలు వీరే
Image Credit : Instagram/Debjani Modak

బిగ్‌ బాస్‌ తెలుగు 10లోకి రాబోతున్న సెలబ్రిటీలు వీరే

ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ ప్రారంభానికి ఇంకా ఆరు రోజులే ఉంది. సెప్టెంబర్‌ 1న(ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపిక జరిగిందని సమాచారం. ఈ సారి పలువురు క్రేజీ కంటెస్టెంట్లు రాబోతున్నారట. ఇందులో కమెడియన్లు, టీవీ నటీమణులు ఉన్నారు. కామెడీకి, గ్లామర్‌కి ప్రయారిటీ ఇచ్చారట. ఓ హీరో కూడా రాబోతున్నాడు. వారిలో త్రిగుణ్‌, రాకింగ్‌ రాకేష్‌, రామ్‌ ప్రసాద్‌, దేబ్జానీ, టెంపర్‌ వంశీ, కృష్ణుడు, జబర్దస్త్ నరేష్‌ వంటి వారు రాబోతున్నారని సమాచారం. అలాగే చైత్ర రాయ్‌, జ్యోతి, ముఖేష్‌ గౌడ వంటి వారు రాబోతున్నారని అంటున్నారు. దీంతో ఈ షోపై ముందు నుంచే ఆసక్తి ఏర్పడింది.

34
అగ్నిపరీక్ష నుంచి ఎంపికైన కామనర్స్
Image Credit : instagram/@teluguallwikimawa

అగ్నిపరీక్ష నుంచి ఎంపికైన కామనర్స్

ఇక అగ్నిపరీక్ష నుంచి ఎవరు రాబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఓటింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. వచ్చిన ఓట్లని బట్టి ఫైనల్‌ కంటెస్టెంట్లని ఎంపిక చేస్తారు. అయితే కొంతమంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రోహిత్‌, రాజాకుమారి, అమన్‌, చరణ్‌, సింగర్‌ ఝాన్సీ, శ్రిష్టి, షాలిని వంటి కామనర్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు వస్తారనేది సస్పెన్స్ గా మారింది. బిగ్‌ బాస్‌ ఓపెనింగ్‌ రోజు వీరిని రివీల్‌ చేయనున్నారు. అయితే ఇప్పుడు లీక్‌ అయిన సమాచారం మేరకు ఒక కంటెస్టెంట్ ఇప్పటికే ఓకే అయ్యిందట.

44
సింగర్‌ ఝాన్సీతోపాటు ఫైనల్‌ అయ్యింది వీళ్లేనా?
Image Credit : instagram/@singer_jhansi

సింగర్‌ ఝాన్సీతోపాటు ఫైనల్‌ అయ్యింది వీళ్లేనా?

సింగర్‌ ఝాన్సీ.. అగ్నిపరీక్ష నుంచి ఎంపికైందని తెలుస్తోంది. తను బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి వెళ్లేందుకు ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని సమాచారం. రైతుగా, సింగర్‌గా ఆమె ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో ఇప్పటికే ఫేమస్‌ అయ్యింది. ఇప్పుడు అగ్నిపరీక్షలో తనదైన ఆటతో, సమాధానాలతో ఆకట్టుకుంది ఝాన్సీ. అయితే రైతు అనే కార్డ్ వాడుతుందనే విమర్శలు వచ్చాయి. కానీ వాటిని తిప్పికొడుతూ ముందుకు సాగుతుంది. ఇప్పుడు చివరి మెట్టు వరకు చేరిందని, బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి కూడా ఆమె వెళ్తుందని తెలుస్తోంది. ఝాన్సీ ఓకే అయితే మరో రైతు బిడ్డగా హౌజ్‌లో రచ్చ చేయబోతుందని చెప్పొచ్చు. ఝాన్సీతోపాటు రోహిత్‌, అమన్‌, చరణ్‌, శ్రిష్టిలు కూడా కన్ఫమ్‌ అని సమాచారం. షాలిని పేరు కూడా వినిపిస్తోంది. ఈ సారి ఆరుగురు కామనర్స్ ని హౌజ్‌లోకి పంపే అవకాశం కనిపిస్తుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ రొట్టగ్యాంగ్, నోరు జారిన త్రిగుణ్, షాలినీ వర్సెస్ నీతూ, ఆరో వారం నామినేషన్స్‌లో పీక్స్‌కి చేరిన రచ్చ..
Recommended image2
Jailer 2 Review: జైలర్‌ 2 ఫస్ట్ రివ్యూ.. ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీ విశ్వరూపం, కానీ మైనస్‌ ఏంటంటే?
Recommended image3
Villains Turned Comedians: ఒకప్పుడు టెర్రర్ విలన్లు.. ఇప్పుడు కామెడీ స్టార్స్! రూటు మార్చిన 5గురు నటులు
Related Stories
Recommended image1
Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్
Recommended image2
Horror Movies: ఈ 5 సినిమాలు చూస్తే రాత్రి ఒంటరిగా నిద్రపోవడం కష్టమే.. ఒక్కో సీన్‌కి వణుకు పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved