రీసెంట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాలు అన్ని ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ నే అందుకుంటున్నాయి.అనుష్క పారి తో పాటు హేట్ స్టోరీ 4 కూడా దారుణమైన రేటింగ్స్ అందుకుంది. ఎవరు ఊహించని విధంగా 1 రేటింగ్ అందుకోవడం ఓ రకంగా షాకింగ్ విషయమని చెప్పాలి. 

పారి విషయం పక్కనపెడితే.. హేట్ స్టోరీ 4 పై నార్త్ ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఓ వర్గం కుర్రకారు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎదురుచూశారు. కానీ సినిమా అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేదు. తారాగణం - కాస్ట్యూమ్ వంటి విషయాల్లో మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమా కథను నడిపించిన విధానం మాత్రం పరమ చెత్తగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. 

పైగా స్కిన్ షో అయితే చాలా మితి మీరిందని. కనీసం దర్శకుడు కొన్ని సీన్స్ లలో కూడా జాగ్రత్త తీసుకోలేదు అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మొత్తంగా సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గ విషయం ఉందా అని అంటే హీరోయిన్ ఊర్వశి అందాలు స్పెషల్ అని టాక్ వస్తోంది. కాకపోతే ఆ క్లీవేజ్ డోస్ ఎక్కువవడంతో కొందరికి నచ్చకపోయినా హాట్ సీన్స్ ని ఇష్టపడేవారు ఊర్వశి అందానికి ఫిదా అవ్వాల్సిందే అని క్రిటిక్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.