గోపీచంద్ నుంచి వస్తున్న మరో యాక్షన్ మూవీ చాణక్య. గతంలో గోపీచంద్ నటించిన యాక్షన్ మూవీ సాహసం ప్రేక్షకులని మెప్పించింది. తాజాగా విడుదలైన చాణక్య ట్రైలర్ ని పరిశీలిస్తే.. ఈ చిత్రంలో గోపీచంద్ రా(RAW) ఏజెంట్ గా నటిస్తున్నాడు. పాకిస్తాన్ కరాచీ నేపథ్యంలో ఓ ఆపరేషన్ ని లీడ్ చేసే ఏజెంట్ గా గోపీచంద్ రంగంలోకి దిగుతున్నాడు. 

మెహ్రీన్ గ్లామర్, గోపీచంద్ తో వచ్చే సన్నివేశాలు ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అదరగొట్టే యాక్షన్ ఎపిసోడ్స్, థ్రిల్లింగ్ అంశాలు బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తోంది. గోపీచంద్ పవర్ ఫుల్ ఏజెంట్ గా కనిపిస్తూనే స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్నాడు. 

చావుకు తెగించునోడు బులెట్ కు భయపడడు అంటూ ట్రైలర్ చివర్లో గోపీచంద్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నాజర్, జయప్రకాష్ పాత్రలు కూడా ట్రైలర్ లో ఆసక్తికరంగా ఉన్నాయి.