యాంకర్ ప్రదీప్ తో 'పెళ్లిచూపులు' అనే షోని మొదలుపెట్టింది స్టార్ మా యాజమాన్యం. బుల్లితెర ఇండస్ట్రీలో ప్రదీప్ పెళ్లి హాట్ టాపిక్ కావడంతో దాన్నే కాన్సెప్ట్ గా తీసుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. దీనికి యాంకర్ గా సుమ కూడా వ్యవహరిస్తోంది. అయితే ఈ షో మొదలైనప్పటి నుండి ప్రేక్షకుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఊహించిన స్థాయిలో ఈ ప్రోగ్రామ్ కి టీఆర్పీ రేటింగులు కూడా రావడం లేదని సమాచారం. అందుకే వీలైనంత త్వరగా షో పూర్తి చేయాలని భావిస్తున్నారు. మహిళలను కిన్చేపరిచే విధంగా ఈ షో ఉంటుందని 14 మందిలో ఒక్క అమ్మాయినే పెళ్లి చేసుకుంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటని..? కొందరు సామాజిక కార్యకర్తలు తెగ బాధపడిపోతున్నారు. ఒక అడుగు ముందుకేసి అమ్మాయిల కుటుంబాలను కూడా నిందించారు. 

అయితే వారందరూ కూడా షో ఎలా ఉండబోతుందనే క్లారిటీతో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొన్న అమ్మాయిల్లో దాదాపు చాలా మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే అని తెలుస్తోంది. సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించిన వారే.. తమ కెరీర్ ని బిల్డ్ చేసుకుందామనే ఉద్దేశంతోనే వారు ఇక్కడకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని షోలో కొంతమంది అమ్మాయిలు కూడా బయటపెట్టారు.

ప్రదీప్ మీద ప్రేమతో అమ్మాయిలు ఈ షోకి రాలేదని, తమ కెరీర్ ని బిల్డ్ చేసుకుందామని వచ్చినట్లు కామెంట్స్ చేశారు. షోలో ఒకరిద్దరు తప్పించి మిగిలిన వాళ్లు మాత్రం ఈ షోతో పాపులర్ అవ్వాలనే వచ్చినట్లు స్పష్టమవుతోంది. షోలో పాల్గొన్న జ్ఞానేశ్వరి, గీతిక, యశ్వి వంటి అమ్మాయిలు షార్ట్ ఫిలింలో హీరోయిన్లుగా నటించారు. దివ్య డెకాటే మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది.

రీతూ చౌదరి, షబీనా, సాహితీ వంటి వారు యాంకర్లుగా పని చేసిన అమ్మాయిలే.. సో వారందరూ ప్రదీప్ కోసం బాధ పడతారని ఈ షోతో సమాజానికి చెడు జరుగుతుందని ఆలోచించడం మానేసి షోని షోగా చూస్తే బాగుంటుందని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

యాంకర్ ప్రదీప్, సుమలపై కేసు నమోదు చేయండి!

ప్రదీప్ కి 'పెళ్లిచూపులు' సెట్ కాలేదా..?

పెళ్లిచూపుల్లో కౌశల్!

ప్రదీప్ శోభనం కూడా ఛానెల్ లో పెట్టేస్తారేమో.. 'పెళ్లిచూపులు'పై విమర్శలు!

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపుల్లో ప్లే చేసిన కులం!

యాంకర్ 'పెళ్లిచూపులు' నిశ్చితార్ధం వరకేనా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు: ఎక్కువ ఇంప్రెష్ చేసిన అమ్మాయి ఎవరంటే...