Asianet News TeluguAsianet News Telugu

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు: ఎక్కువ ఇంప్రెష్ చేసిన అమ్మాయి ఎవరంటే...

ఆదివారంనాడు అమ్మాయిలు గుర్రపు బగ్గీల్లోనూ, కార్లలోనూ, టీ వీలర్స్ మీదా, పల్లకీలో వచ్చి ప్రదీప్ కు ప్రపోజ్ చేశారు. ప్రదీప్ ను జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి వారు తమ ఆసక్తిని ప్రదర్శించారు.

Star Maa seeks a perfect match for Pradeep Machiraju in PelliChoopulu
Author
Hyderabad, First Published Sep 30, 2018, 10:36 PM IST

హైదరాబాద్: స్టార్ మాలో ఆదివారంనాడు పెళ్లి చూపులు రియాల్టీ షో ప్రారంభమైంది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు తగిన మ్యాచ్ ను ఎంపిక చేసుకోవడానికి ఈ షోను ప్రారంభించారు. సుమ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 

బిగ్ బాస్ 2 పూర్తయిన వెంటనే స్టార్ మా టీవీ చానెల్ ఈ షోను ప్రారంభించింది. ఇటువంటి షోలు ఇతర భాషల్లో నడిచాయి. హిందీలో రాహుల్ కీ దునియా, రాఖీ కా స్వయంవర్ రియాల్టీ షోలు విజయవంతంగా సాగాయి. కలర్స్ తమిళంలో నటుడు ఆర్యతో ఎంగే వీటు మప్పిలి పేరుతో ఇటువంటి రియాల్టీ షో ప్రసారమైంది.

ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజుతో స్టార్ మా ఎప్పుడో ప్రోమోను విడుదల చేసింది. ఇన్నాళ్లుగా పెళ్లెప్పుడు చేసుకుంటావనే ప్రశ్నకు ఆయన జవాబు ఇవ్వడాన్ని ఎలా తప్పించుకుంటున్నాడో అందులో చూపించారు. ఇందులో పాల్గొనడానికి ఎంట్రీలు ఆహ్వానించారు. 

వివిధ రియాల్టీ షోలకు, ఆడియో లాంచ్ ఫంక్షన్స్ కు, అవార్డు ఫంక్షన్ కు, ఇతర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి ప్రతి తెలుగు ఇంటిలోనూ పాపులర్ అయ్యారు. 

ఆదివారంనాడు అమ్మాయిలు గుర్రపు బగ్గీల్లోనూ, కార్లలోనూ, టీ వీలర్స్ మీదా, పల్లకీలో వచ్చి ప్రదీప్ కు ప్రపోజ్ చేశారు. ప్రదీప్ ను జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి వారు తమ ఆసక్తిని ప్రదర్శించారు. ప్రదీప్ పై తమకు ఎంత ప్రేమ ఉందో తమ తమ పద్ధతుల్లో చెప్పారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక బహుమతి తెచ్చారు. ప్రతిగా ప్రతి ఒక్కరికీ పుష్పగుచ్ఛం ఇచ్చారు ప్రదీప్. 

ప్రపోజ్ చేసిన అమ్మాయిలు వీరే...

చలిమిశెట్టి దివ్య (మచిలీపట్నం)
నెహా అజ్మల్ (మలేషియా, సాఫ్ట్ వేర్ ఇంజనీరు)
కోనేరు రమ్యక్రిష్ణ (విజయవాడ)
అంబాల శ్రేయ (హైదరాబాద్), పెళ్లి డ్రెస్ గిఫ్ట్ గా ఇచ్చింది.
దాసరి సాహితి (విజయవాడ)
నవ్య సౌజన్య కనకాల 
రీతు చౌదరి (వృత్తి జర్నలిజం)
దీనా కృపా (దుబాయ్, ప్రదీప్ అమ్మ కోసం చీర తెచ్చింది)
మౌనిక (కడప)
డయానా (అనంతపురం)
చంద్రకళ. వి (బెంగుళూర్, అకాడమీ కౌన్సెలర్)
దివ్య అశోకరావు డెకాటే
షేక్ షబీనా 
జ్ఝానేశ్వరి కందిరేగుల

ఈ 14 మందిలో ఎక్కువ ప్రదీప్ ను ఇంప్రెష్ చేసిన అమ్మాయి దీనా కృపా.. ఈ అమ్మాయి తాను జాబ్ మానేసి నీ కోసం వచ్చానంటూ ప్రదీప్ నకు చెప్పింది. ప్రదీప్ ఆమెతో కాసేపు మాట్లాడారు. 

ఆ తర్వాత ఎక్కువ ఇంప్రెష్ చేసిన అమ్మాయిని ప్రదీప్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అతను జ్ఝానేశ్వరిని ఎంపిక చేసుకున్నాడు. వారిద్దరు కాసేపు మాట్లాడుకున్నాడు.

సంబంధిత వార్త

యాంకర్ 'పెళ్లిచూపులు' నిశ్చితార్ధం వరకేనా..?

Follow Us:
Download App:
  • android
  • ios