ప్రముఖ యాంకర్ ప్రదీప్ పై స్టార్ మా యాజమాన్యం 'పెళ్లిచూపులు' షోని డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ మొదటి నుండి విమర్శలే ఎదురవుతున్నాయి. కొందరు కార్యకర్తలు ఈ షోని నిలిపివేయాలని షో నిర్వాహకులపై, ప్రదీప్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్టార్ యాంకర్ సుమ ఈ ప్రోగ్రామ్ లో భాగం కావడంతో ఎన్నడూ లేని విధంగా ఆమెపై కూడా నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. తాజాగా రాయలసీమ మహిళా సంఘం ఈ షోని నిలిపివేయాలని ధర్నా చేశారు. కర్నూలులో శుక్రవారం కలెక్టరేట్ వద్ద కొందరు మహిళలు ప్రదీప్ పెళ్లిచూపులు షోని బ్యాన్ చేయాలని ధర్నా చేశారు.

ఆడవాళ్లని అంగడి సరుకుగా చేసే అవమానిస్తోన్న ప్రదీప్, సుమ, షో యాజమాన్యం మహిళల మనోభావాలను దెబ్బతీస్తున్నారని సంఘం జిల్లా అధ్యక్షురాలు శకుంతల అన్నారు. తెలుగు ప్రజల సంప్రదాయాలను, ఆచారాలకి భాగం కలిగించే విధంగా ఈ షోని నిర్వహిస్తున్నారని అన్నారు.

ప్రదీప్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని.. సుమపై, టీవీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ పి.రవి సుభాష్ కి వినతిపత్రం అందించారు. 

ఇవి కూడా చదవండి.. 

ప్రదీప్ కి 'పెళ్లిచూపులు' సెట్ కాలేదా..?

పెళ్లిచూపుల్లో కౌశల్!

ప్రదీప్ శోభనం కూడా ఛానెల్ లో పెట్టేస్తారేమో.. 'పెళ్లిచూపులు'పై విమర్శలు!

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపుల్లో ప్లే చేసిన కులం!

యాంకర్ 'పెళ్లిచూపులు' నిశ్చితార్ధం వరకేనా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు: ఎక్కువ ఇంప్రెష్ చేసిన అమ్మాయి ఎవరంటే...