ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ వారు యాంకర్ ప్రదీప్ తో 'పెళ్లిచూపులు' అనే ప్రోగ్రామ్ ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రామ్ మీద 
రోజురోజుకి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ షో ద్వారా మహిళల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు తెలుగు సంప్రదాయాలను అవహేళన చేస్తున్నారని సోషల్ మీడియాలోనే కాకుండా కొందరుసామాజిక కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు.

ప్రదీప్ పెళ్లి కోసం మహిళల జీవితాలతో ఆడుకుంటారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ రియాలిటీ షో కోసం ఎంపికైన 14 మంది అమ్మాయిలకి రకరకాల టాస్క్ లు పెట్టడం వారిలో ఒకరిని ఎంపిక చేయడమనేది కరెక్ట్ కాదని వాదిస్తున్నారు. ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటనేది..? మహిళా సంఘం నేతల ఆగ్రహం.

నాగేంద్ర కుమార్ అనే సినీ విశ్లేషకుడు ఈ ప్రోగ్రామ్ పై ఓ ఛానెల్ వేదికగా మండిపడ్డారు. ''ఆడపిల్లల గౌరవాన్ని బజారుకీడిస్తున్నారు. సినిమాలలో క్లబ్ డాన్సర్ ఇంట్రడక్షన్ షాట్స్ కోసమే పెట్టే షాట్స్ ని ఈ షోలో అమ్మాయిలకి పెడుతున్నారు.ప్రదీప్ అనేవాడొక మదన కామరాజు, ఆయనకి బహిరంగ స్వయంవరం.. దానికో టీవీ ఛానెల్ సపోర్ట్.. సిగ్గుచేటు.

సుమ ఎన్నో అధ్బుతమైన టీవీ షోలు చేసింది. అలాంటిది ఆమె ఇలాంటి ప్రోగ్రాంని హోస్ట్ చేయడం.. దరిద్రమైన విషయం. ప్రదీప్ ని తీసుకొచ్చి మహిళాలోకంపై వదులుతుండడంలో అర్ధం లేదు. కొంత కాలం తరువాత ప్రదీప్ శోభనం కూడా ఛానెల్ లో పెట్టేస్తారేమో.. ప్రదీప్ ని చూస్తూ షోలో అమ్మాయిలు చేసే యాక్ట్స్.. ఎంతో జుకుప్త్సాకరంగా ఉంటున్నాయి.

నిజంగానే ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడేమో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. నిజంగానే చేసుకుంటాడనుకుందాం.. ఆ విషయం ఇంకా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. మిగిలిన అమ్మాయిలకి పెళ్లవుతుందా..? వారు పెళ్లి చూపులకి కూడా పనికిరారు. ఆడపిల్లలు వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారు. అసలు ఈ షోకి ఆడపిల్లలని ఎలా పంపించారో.. వాళ్ల తల్లితండ్రులని ప్రశ్నించాలి'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇవి కూడా చదవండి.. 

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపుల్లో ప్లే చేసిన కులం!

యాంకర్ 'పెళ్లిచూపులు' నిశ్చితార్ధం వరకేనా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు: ఎక్కువ ఇంప్రెష్ చేసిన అమ్మాయి ఎవరంటే...