Asianet News TeluguAsianet News Telugu

ప్రదీప్ కి 'పెళ్లిచూపులు' సెట్ కాలేదా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి బయట హాట్ టాపిక్ కావడంతో అదే కాన్సెప్ట్ తో స్టార్ మా యాజమాన్యం 'పెళ్లిచూపులు' అనే ప్రోగ్రామ్ ని మొదలుపెట్టింది. ప్రదీప్, యాంకర్ సుమ క్రేజ్ తో ఈ షోపై హైప్ పెంచారు. 14 మంది అమ్మాయిలను, యాంకర్ సుమ, ప్రదీప్ ల హోస్టింగ్ తో మొదలైన ఈ షోతో టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజ్ లో వస్తాయని ఆశించారు. 

huge loss for pradeep pelli choopulu
Author
Hyderabad, First Published Nov 2, 2018, 4:09 PM IST

యాంకర్ ప్రదీప్ పెళ్లి బయట హాట్ టాపిక్ కావడంతో అదే కాన్సెప్ట్ తో స్టార్ మా యాజమాన్యం 'పెళ్లిచూపులు' అనే ప్రోగ్రామ్ ని మొదలుపెట్టింది. ప్రదీప్, యాంకర్ సుమ క్రేజ్ తో ఈ షోపై హైప్ పెంచారు.

14 మంది అమ్మాయిలను, యాంకర్ సుమ, ప్రదీప్ ల హోస్టింగ్ తో మొదలైన ఈ షోతో టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజ్ లో వస్తాయని ఆశించారు. కానీ ఆదిలోనే ఈ షోపై విమర్శలు రావడం మొదలయ్యాయి. షోలో కొంతమంది అమ్మాయిలు చేసే అతి కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ షోని చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. కొందరు 
సామజిక కార్యకర్తలు ఈ షోని నిలిపివేయాలని యాజమాన్యాన్ని కోరారు. 

అయితే ఈ షోపై క్రేజ్ పెంచడానికి మధ్యలో జబర్దస్త్ ఆర్టిస్ట్ లను, కొందరు టీవీ సీరియల్ నటీమణులను తీసుకొచ్చారు. హాట్ యాంకర్ అనసూయ, బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ సైతం ఈ షోలో పాల్గొన్నారు. ఎంత చేస్తున్నా.. రేటింగ్స్ మాత్రం రాకపోవడంతో నిర్వాహకులకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 కోట్ల నష్టాన్ని ఈ షో నిర్వాహకులు భరించాల్సి వచ్చిందట.

దీంతో రోజులు పెంచుకుంటూ పోతే మరిన్ని నష్టాలు వచ్చే అవకాశాలు ఉండడంతో మూడు రోజుల క్రితమే అమ్మాయిలందరితోషూటింగ్ పూర్తి చేసేసి బయటకి పంపించేసినట్లు సమాచారం. అయితే షో పూర్తయ్యే వరకు బయట ఎక్కడా కనిపించకూడదని అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే షో ముగించనున్నట్లు తెలుస్తోంది. 
 

ఇవి కూడా చదవండి.. 

పెళ్లిచూపుల్లో కౌశల్!

ప్రదీప్ శోభనం కూడా ఛానెల్ లో పెట్టేస్తారేమో.. 'పెళ్లిచూపులు'పై విమర్శలు!

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపుల్లో ప్లే చేసిన కులం!

యాంకర్ 'పెళ్లిచూపులు' నిశ్చితార్ధం వరకేనా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు: ఎక్కువ ఇంప్రెష్ చేసిన అమ్మాయి ఎవరంటే...

Follow Us:
Download App:
  • android
  • ios