Asianet News TeluguAsianet News Telugu

యాంకర్ 'పెళ్లిచూపులు' నిశ్చితార్ధం వరకేనా..?

వచ్చే సోమవారం నుండి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో 'పెళ్లిచూపులు' అనే ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. దీనికి వ్యాఖ్యాతగా సుమ, ప్రదీప్ లు వ్యవహరిస్తున్నారు. చాలా కాలంగా అందరూ యాంకర్ ప్రదీప్ పెళ్లిపై కామెంట్స్ చేస్తూ కామెడీ క్రియేట్ చేస్తున్నారు. 

Anchor's Pellichoopulu Only Up To Engagement?
Author
Hyderabad, First Published Sep 28, 2018, 2:53 PM IST

వచ్చే సోమవారం నుండి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో 'పెళ్లిచూపులు' అనే ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది. దీనికి వ్యాఖ్యాతగా సుమ, ప్రదీప్ లు వ్యవహరిస్తున్నారు. చాలా కాలంగా అందరూ యాంకర్ ప్రదీప్ పెళ్లిపై కామెంట్స్ చేస్తూ కామెడీ క్రియేట్ చేస్తున్నారు. దీన్నే కాన్సెప్ట్ గా తీసుకొని ప్రదీప్ పెళ్లిచూపులు అంటూ కార్యక్రమాన్ని నడిపించనున్నారు.

అయితే ఈ ప్రోగ్రాంకి విజేతగా నిలిచిన వారిని నిజంగానే ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడా..? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. గతంలో ఇలాంటి టీవీ షోలు చాలానే వచ్చాయి. అయితే తెలుగుకి ఇది కొత్త. హీరోయిన్ అంకిత ఇలా ఓ టీవీ ఛానెల్ లో కంటెస్టెంట్ గా వచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది.

ఈ టెలివిజన్ స్వయంవరం వెస్ట్ లో బాగానే ఫేమస్ అయింది. ఇప్పుడు తెలుగులో ప్రదీప్ తో షో మొదలుపెట్టారు. ఈ షోలో ప్రదీప్ కొందరు అమ్మాయిలతో మాట్లాడి, ఎంపిక చేసిన వారికి రకరకాల పరీక్షలు నిర్వహిస్తాడు.

ఫైనల్ గా ఈ షోలో గెలిచిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని టాక్. అయితే ఈ పెళ్లి కేవలం షో వరకేనట. అది కూడా ప్రదీప్ షోలో పెళ్లి చేసుకోడని టాక్. ఎంగేజ్మెంట్ వరకు చూపించి పెళ్లిని లైట్ తీసుకోబోతున్నారని సమాచారం. మరి ఈ పెళ్లిచూపులు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి! 

Follow Us:
Download App:
  • android
  • ios