బిగ్ బాస్ షో తరువాత స్టార్ మా యాజమాన్యం 'పెళ్లిచూపులు' అనే మరో రియాలిటీ షోని ప్రసారం చేస్తోంది. ఈ షోలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యాంకర్ ప్రదీప్ ని పెళ్లి చేసుకోవాలని పరితపించే కొందరు అమ్మాయిలను తీసుకొని వారితో రకరకాల టాస్క్ లను చేయిస్తుంటారు.

చివరగా షో విజేతగా నిలిచిన వారిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటారని అంటున్నారు కానీ అది ఎంతవరకు జరుగుతుందనేది సందేహమే.. ఇది ఇలా ఉండగా.. ఈ షో టీఆర్పీ రేటింగ్స్ పెంచడానికి షోలోకి జబర్దస్త్ కమెడియన్స్ ని ఒకసారి తీసుకొచ్చారు.

ఆ తరువాత బుల్లితెర నటీమణులు, యాంకర్ అనసూయ ఇలా చాలా మంది ఈ షోకి వస్తూ వెళ్తుంటారు. తాజాగా ఈ షోకి బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేసింది పెళ్లిచూపులు టీమ్. కౌశల్ తన కూతురు లల్లితో పాటు వచ్చి స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేశాడు.

ఆ తరువాత 'పెళ్లిచూపులు' షోలో పాల్గొన్న అమ్మాయిలందరూ సరికొత్త కాస్ట్యూమ్స్ ధరించి స్టేజ్ మీద ప్రదీప్ చూస్తుండగా ర్యాంప్ వాక్ చేశారు. ఈ షోకి జడ్జిలగా వ్యవహరించారు కౌశల్. 'ప్రదీప్ మీద ఎంతో ఇష్టంతో నడిచినట్లు కనిపిస్తుందంటూ' అమ్మాయిలతో అన్నారు.  

ఇవి కూడా చదవండి.. 

ప్రదీప్ శోభనం కూడా ఛానెల్ లో పెట్టేస్తారేమో.. 'పెళ్లిచూపులు'పై విమర్శలు!

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపుల్లో ప్లే చేసిన కులం!

యాంకర్ 'పెళ్లిచూపులు' నిశ్చితార్ధం వరకేనా..?

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు: ఎక్కువ ఇంప్రెష్ చేసిన అమ్మాయి ఎవరంటే...