Asianet News TeluguAsianet News Telugu

Balakrishna-NTR:బాలయ్యతో ఎన్టీఆర్... సోషల్ మీడియాలో వినిపిస్తున్న సీరియస్ డిమాండ్!

మహా అయితే ఎన్టీఆర్(NTR) సినిమాలో బాలయ్య,.. బాలయ్య సినిమాలో ఎన్టీఆర్ క్యామియో చేసే అవకాశం కలదు. పూర్తి స్థాయి మల్టీస్టారర్ అంటే చాలా కష్టం. కాగా వీరిద్దరూ కలిసి సినిమా చేయకున్నా... ఒకే వేదిక పంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

fans seriously demanding to ntr in balakrishna unstoppable show
Author
Hyderabad, First Published Jan 25, 2022, 11:10 AM IST

ద్దరు స్టార్ హీరోల కాంబినేషన్ పై ఉండే హైప్ వేరు. చిరు(Chiranjeevi)-పవన్, నాగ్-నాగ చైతన్య, వెంకటేష్-రానా వంటి కాంబినేషన్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. వీటన్నింటికీ మించి ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమ కూడా ఎదురుచూస్తున్న కాంబినేషన్ బాలకృష్ణ-ఎన్టీఆర్. నందమూరి కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు అగ్రహీరోలు కలిసి నటించాలని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. 

అయితే ఇదంత ఈజీ కాదు. చాలా అవరోధాలు ఉన్నాయి. కథ కుదరాలి, కథ కుదిరినా ఇద్దరికీ డేట్స్ అడ్జస్ట్ అవ్వాలి. డేట్స్ సెట్ అయినా కలిసి నటించాలనే ఉద్దేశ్యం ఉండాలి. బాలయ్య(Balakrishna), ఎన్టీఆర్ మధ్య మనస్పర్థలు ఉన్నాయనేది అందరికీ తెలిసిన నిజం. వ్యక్తిగతంగా ఇద్దరికీ ఒకరిపై మరొకరికి అభిమానం ఉన్నా... రాజకీయ ఆధిపత్యం కారణంగా దూరం పెరిగింది. నందమూరి కుటుంబం మొత్తం ఒకవైపు హరికృష్ణ, ఎన్టీఆర్ ఒకవైపు అన్నట్లు చాలా కాలం సాగింది. తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కి సముచిత స్థానం లేదన్న అసహనం ఉంది. 

ఇవన్నీ బయటికి మాట్లాడకున్నప్పటికీ జరిగే అంతర్యుద్ధం అదే. అలాగే ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా ఎదగాలన్న ఆశతో భారీ చిత్రాలు ప్రకటిస్తున్నారు. ఒక్కో సినిమాకు రెండేళ్ల సమయం తీసుకోవచ్చు. దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ప్రకటించిన చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నాయి. ఈ క్రమంలో బాబాయ్ బాలయ్యతో సినిమా చేసే తీరిక ఆయనకు దొరక్కపోవచ్చు. 

మహా అయితే ఎన్టీఆర్(NTR) సినిమాలో బాలయ్య,.. బాలయ్య సినిమాలో ఎన్టీఆర్ క్యామియో చేసే అవకాశం కలదు. పూర్తి స్థాయి మల్టీస్టారర్ అంటే చాలా కష్టం. కాగా వీరిద్దరూ కలిసి సినిమా చేయకున్నా... ఒకే వేదిక పంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్ స్టాపబుల్ షోతో హోస్ట్ గా మారిన బాలయ్య రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఆహా యాప్ లో ప్రసారం అవుతున్న ఈ షో భారీ ఆదరణ దక్కించుకుంది. 

దీంతో అన్ స్టాపబుల్ (Unstoppable)షోలో ఎన్టీఆర్ పాల్గొనాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. బాలయ్య-ఎన్టీఆర్ మధ్య నడిచే ఆసక్తికర సంభాషణ చూడాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. అన్ స్టాపబుల్ షోకి ఎన్టీఆర్ ని పిలవాలి కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అయితే ఫస్ట్ సీజన్ మహేష్ ఎపిసోడ్ తో ముగిసినట్లుగా తెలుస్తుంది. కాబట్టి కనీసం సీజన్ 2 లో ఎన్టీఆర్ ఎపిసోడ్ సిద్ధం చేయాలంటున్నారు. నందమూరి అభిమానుల నుండి ఇది సీరియస్ డిమాండ్ గా ఉంది. 

మరి నందమూరి అభిమానుల డిమాండ్ ని ఆహా నిర్వాహకులు ఎంత వరకు సీరియస్ గా తీసుకొని ఆ దిశగా ప్రయత్నిస్తారో చూడాలి. కాగా మహేష్ ఎపిసోడ్ పై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో అద్భుతంగా ఉన్న నేపథ్యంలో హైప్ పెరిగిపోయింది. మొత్తంగా ఆహా యాప్ కి ఎనలేని గుర్తింపు తెచ్చి పెట్టిన ఘనత బాలయ్యకు దక్కింది. ఈ షో కారణంగా ఆహా చందాదారుల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios