ఎక్స్ క్లూజివ్ : ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చేయనున్న పూరి

Exclusive Puri jagannath to direct NTR Biopic
Highlights

 ఎన్టీఆర్ బయోపిక్ ని డైరెక్ట్ చేయనున్న పూరి

ఎన్టీఆర్ బయోపిక్ ఎపిసోడ్ లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బాలయ్య నటిస్తూ - నిర్మిస్తున్న ఎన్టీఆర్ సినిమా ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నాడు. తేజ తానే తప్పుకున్నాడా.. లేక తప్పించారా అనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. తేజ తప్పుకున్న విషయం మాత్రం మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఎలా చూపించాలన్నదాని పై బాలయ్య - తేజ మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. తేజ కాకుండా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డీల్ చేయబోతున్నారు అనేది కూడా సినీ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. తేజ తప్పుకోవడం అనూహ్య పరిణామమని అంటున్నారు.

ఎన్టీఆర్ సినిమా మార్చి 29వ తేదీ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. సినీ ఇండస్ట్రీలోని అతిరథ మహారథులు అందరూ తరలివచ్చారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది అన్న టైంలో.. కీలకమైన డైరెక్టర్ తేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం చర్చనీయాంశం అయ్యింది.  బాలయ్య స్వయంగా దర్శకత్వం వహిస్తారని ఓ ప్రచారం జరుగుతుండగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా లేకపోలేదనే మరో వాదన కూడా ఉంది. ఈ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది. ఆ చిత్రాన్ని పూరీజగన్నాద్ డైరెక్ట్ చేయనున్నాడట. బాలయ్యతో పైసావసూల్ సినిమా చేసిన పూరి. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికి బాలక్రిష్ణ క్యారెక్టరైసేషన్ కి మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతేకాదు పూరీతో బాలయ్యకు మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ డైరెక్ట్ చేసే ఛాన్స్ పూరీ కి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడని ఫిలినగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇది అధికారికంగా ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే.
 

loader