Asianet News TeluguAsianet News Telugu

దారుణం : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోయిన్ గర్భవతి అంటూ...!

హాలీవుడ్ స్టార్ హీరోయిన్  ఎమ్మా రాబర్ట్స్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నది. తన లవర్ గెర్రెట్ హెడ్‌లుడ్‌తో కలిసి మొదట సంతానానికి సిద్ధమైంది. ఎమ్మారాబర్ట్స్ ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.. కానీ ఆమె తల్లి మాత్రం అధికారికంగా ప్రకటించారు. అయితే దీన్ని ఆర్ ఆర్ ఆర్ తో ముడిపెట్టడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అప్పట్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎన్టీఆర్‌కు జోడిగా నటించాల్సిన డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక...ఆమె సరసన ఎవరు నటించే అవకాసం ఉంది అనే వార్తలు గుప్పు మన్నాయి.

Emma Roberts expecting first child with boy friend
Author
Hyderabad, First Published Jun 27, 2020, 9:43 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూస్ కు హైప్ రావటం కోసం అందుకు రకరకాల ట్విస్ట్ లు ఇస్తూంటారు కంటెంట్ రైటర్స్. ముఖ్యంగా పెద్ద వాళ్ల పేర్లు ఆ న్యూస్ లో ఇమిడేలా చూస్తూంటారు. అయితే ఒక్కోసారి అవి వికటిస్తూంటాయి. తాజాగా అలాంటిదే ఒక వార్త..సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది. ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ గర్బవతి అని, రాజమౌళి కు కొత్త కష్టం వచ్చిందని ఆ వార్త సారాంశం. అయితే ఆ హీరోయిన్ ఎవరూ అంటే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కోసం అనుకున్నారు అని రూమర్స్ వచ్చిన ఆమె. అంతే కానీ ఆమెను ఖరారు చేయలేదు. ఎక్కడా ఎవరూ అఫీషియల్ గా చెప్పింది లేదు. అంతే కాదు...ఆమెను కాకుండా ఎన్టీఆర్ సరసన లండన్‌కు చెందిన ఓలివియా మోరీస్‌ ని ఫైనలైజ్ సైతం చేసారు. 

ఇంతకీ విషయం ఏమిటంటే...హాలీవుడ్ స్టార్ హీరోయిన్  ఎమ్మా రాబర్ట్స్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నది. తన లవర్ గెర్రెట్ హెడ్‌లుడ్‌తో కలిసి మొదట సంతానానికి సిద్ధమైంది. ఎమ్మారాబర్ట్స్ ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు.. కానీ ఆమె తల్లి మాత్రం అధికారికంగా ప్రకటించారు. అయితే దీన్ని ఆర్ ఆర్ ఆర్ తో ముడిపెట్టడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అప్పట్లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా నటించాల్సిన డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక... ఆమె సరసన ఎవరు నటించే అవకాసం ఉంది అనే వార్తలు గుప్పు మన్నాయి. దాంతో  మరో హాలీవుడ్‌ భామ ఎమ్మా రాబర్ట్స్‌ను ఫైనల్ చేసారని వార్తలు వచ్చాయి. కానీ  ఓ రీజినల్‌ సినిమాకు బల్క్‌ డేట్స్‌ ఇచ్చేందుకు ఎమ్మా ఆసక్తి చూపించటం లేదని తర్వాత చెప్పుకున్నారు. అంతే కానీ ఎక్కడా ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఆమె గురించి ప్రస్దావించలేదు. 
 
రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌  హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అత్యధిక భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా కరోనా కారణంగా తాత్కాలికంగా ఫోస్ట్ ఫోన్ అయ్యింది. షూటింగ్ లకు ప్రభుత్వం ఫర్మిషన్ ఇవ్వడంతో రెండు రోజుల పాటు ట్రయల్‌షూట్‌ చేయాలని రాజమౌళి భావించారు.  గండిపేట సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సాబు శిరిల్‌  నేతృత్వంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో ఈ షూటింగ్‌ చేద్దామని అనుకున్నారు. అయితే హైదరాబాద్‌లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర టీమ్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. 

రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ, విడుదల చేసిన టీజర్‌ ఆ అంచనాలను పెంచింది. ఇక కొమరం భీంగా ఎన్టీఆర్‌ కనపడనున్నారు. అలియాభట్‌, ఓలివియా మోరిస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 8, 2021న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios