Asianet News TeluguAsianet News Telugu

హీరోయిన్ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌.. బ్లాక్ చేసిన ఆకతాయిలు

సాధారణంగా ఈషా రెబ్బా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫొటోలు షేర్ చేస్తూంటుంది. ఓ ప్రక్క ఇన్‌స్టాలో యాక్టివ్ గా ఉంటూనే ట్విట్టర్ని కూడా నడుపుతూంటుంది. 

Eesha Rebba s Twitter account hacked
Author
Hyderabad, First Published Aug 18, 2020, 8:05 AM IST

కరోనా మహమ్మారితో కలవరపడుతున్న ప్రజలను సైబర్‌ క్రైమ్స్‌ కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రెటీల సోషల్ మీడియా ఎక్కౌంట్స్ ని హ్యాక్ చేయటం ఓ ఆటగా మారింది. ఇప్పటికే చాలా మంది టాలీవుడ్,బాలీవుడ్ సెలబ్రెటీలు ఇలా హ్యాకింగ్ బారిన పడ్డారు. తాజాగా ఈషా రెబ్బా ట్విట్టర్ ఎక్కౌంట్ ని హ్యాక్ చేసారు. ఈ ఎక్కౌంట్ ని బ్లాకింగ్ మోడ్ లో పెట్టారు. ఆమె తన ఎక్కౌంట్ హ్యాక్ అయ్యిందని కన్ఫర్మ్ చేసారు.
 
సాధారణంగా ఈషా రెబ్బా తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా ఫొటోలు షేర్ చేస్తూంటుంది. ఓ ప్రక్క ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటూనే ట్విట్టర్ ని నడుపుతూంటుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ... ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యిందీ ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమీ తుమీ’, వంటి సినిమాల్లో నటించినా తెలుగమ్మాయి (వరంగల్) కావడంతో సరైన బ్రేక్ రాలేదు.

అయితే నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’, త్రివిక్రమ్-ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత రాగల 24 గంటల్లో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో చేసినా అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఈషా నటనను చూసిన ఓ బాలీవుడ్ నిర్మాత... ఆమెకు తన సినిమాలో ఆఫర్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఓ వెబ్ సీరిస్ చేస్తున్నారామె.

Follow Us:
Download App:
  • android
  • ios