నిర్మాత దిల్ రాజుకి ఈ మధ్యకాలంలో ఒక్క సక్సెస్ కూడా రాలేదు. డిస్ట్రిబ్యూటర్ గా లాభాలు ఆర్జించినప్పటికీ నిర్మాతగా మాత్రం విజయం అందుకోలేకపోయాడు. వచ్చే ఏడాదిలో మాత్రం హిట్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు. మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న సినిమాకి ఒక నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా బిజినెస్ విషయంలో దిల్ రాజు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. హిందీ డబ్బింగ్ రైట్స్ కి రూ.25 కోట్లు డిమాండ్ చేశాడు. దానికి కారణం 'రంగస్థలం' హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.22 కోట్లు అమ్మడుకావడమే.. అయితే 'మహర్షి'లో యాక్షన్ పార్ట్ తక్కువగా ఉండడంతో పాతిక కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మడం కష్టంగా మారింది.

ఈ విషయంలో దిల్ రాజు మహేష్ ని, దర్శకుడిని ఒప్పించి సినిమాలో అదనంగా ఓ ఫైట్ చిత్రీకరించాలని అడిగాడు. కానీ వారు అంగీకరించకపోవడంతో ఇప్పుడు దిల్ రాజు తగ్గక తప్పలేదు. ఫైనల్ గా సినిమా డబ్బింగ్ రైట్స్ ని రూ.20 కోట్లకు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

టీవీ టెలికాస్ట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, డిజిటల్ రైట్స్ కూడా ఈ డీల్ లో భాగమే. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.  

ఇవి కూడా చదవండి.. 

మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనా?

మహేష్ బాబు ఐదు గెటప్పుల్లో..!

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?