దీపిక పదుకోన్, రణవీర్ ల వివాహం ఇటలీలోని లేక్ కోమోలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీపిక, రణవీర్ లతో పాటు వారి సన్నిహితులు, బంధువులు, కొందరు సింగర్స్ ఇటలీ చేరుకున్నారు.

ఎంతో వైభవంగా వీరి వివాహ వేడుక జరగనుంది. ఇటలీలో ఈ జంట పెళ్లికి వేదికైన విల్లా డెల్ బాల్బినెల్లో సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. సింధ్‌, హిందూ సంప్రదాయాల పద్దతుల్లో వీరి వివాహం జరగనుంది.

పెళ్లి మండపాన్ని అలంకరించడానికి పన్నెండు మంది పుష్పాలంకరణ  నిపుణులను రప్పించారని తెలుస్తోంది. పెళ్లికి వచ్చిన వారందరికీ బ్లెవియా విలేజ్ లో ఉన్న రిసార్ట్ అంతటినీ బుక్ చేశారు. ఈ రిసార్ట్ లో నాలుగు రెస్టారంట్లు, బార్లు, స్పా, స్విమ్మింగ్ పూల్ ఇలా అన్ని వసతులు ఉన్నాయట.

ఈ రిసార్ట్ లో ఒక్కో రూమ్ కి రోజుకి రూ.33 వేలు చార్జ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తం 75 రూమ్ లను బుక్ చేశారు. ఈ లెక్కన రోజుకి పాతిక లక్షలు వారానికి రూ.1.75 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి.. 

కత్రినాకి దీపిక వెడ్డింగ్ కార్డ్ అందలేదు.. ఎందుకంటే..?

ఇటలీకి వెళ్తూ కెమెరాకి చిక్కిన ప్రేమజంట!

70కోట్లతో హీరో హీరోయిన్ కొత్త ఇల్లు!

దీపిక పదుకోన్ ఇంట పెళ్లి సందడి మొదలు!

ఆ రోజే ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారంటే..?

పెళ్లికి సిద్దమైన దీపిక - రణ్‌ వీర్.. డేట్ ఫిక్స్!