Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కోసం గ్లోబల్ బ్యూటీని లైన్లోకి తెస్తున్న ప్రశాంత్ నీల్?

ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ఊహించని స్థాయికి చేరింది. ఆయన అప్ కమింగ్ చిత్రాలు భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. కాగా ఎన్టీఆర్ 31 హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ పేరు వినిపిస్తోంది.

crazy buzz on ntr 31 movie priyanka chopra will be the heroine ksr
Author
First Published Jun 7, 2023, 5:33 PM IST

ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. విడుదలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో నిరవధికంగా షూటింగ్ జరుపుతున్నారు. దేవర మూవీలో ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. 

కాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ ప్రకటించి చాలా కాలం అవుతుంది. నిజానికి దేవర మూవీకి ముందే ప్రశాంత్ నీల్ మూవీ ప్రకటన జరిగింది. అనూహ్యంగా ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ కి కమిట్ అయ్యారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కొంచెం వెనక్కి వెళ్ళింది. 2024 ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ మేరకు ఇటీవల అధికారిక సమాచారం ఇవ్వడం జరిగింది. 

ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. యూనివర్సల్ సబ్జెక్టుతో తెరకెక్కనున్న ఈ చిత్రం భారీ స్కేల్ తో ప్లాన్ చేస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్ తో కేటాయించారు. ఈ క్రమంలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను అనుకుంటున్నారట. మొదట మృణాల్ ఠాకూర్, దీపికా పదుకొనె పేర్లు పరిశీలించిన మేకర్స్ ప్రియాంక చోప్రా వైపు మొగ్గు చూపారట. ఈ గ్లోబల్ బ్యూటీ ఎన్టీఆర్ తో జతకట్టడం ఖాయమే అంటున్నారు. 

దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే ఎన్టీఆర్ వార్ 2 చిత్రానికి కమిట్ అయ్యారు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ గా వార్ 2 తెరకెక్కనుంది. ఇది కూడా క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. రానున్న కాలంలో ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ పై విధ్వంసం చేయడం ఖాయం... 

Follow Us:
Download App:
  • android
  • ios