ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా చిత్రానికి రాంచరణ్ నిర్మాత. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ బాధ్యతని తీసుకున్న చరణ్ ఖైదీ నెం 150 చిత్రాన్ని నిర్మించాడు. వెంటనే సైరా లాంటి భారీ చిత్రాన్ని నిర్మాణ భాద్యతలు తీసుకున్నాడు. 

సైరా చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. రంగస్థలం చిత్రానికి కూడా సుస్మితనే కాస్ట్యూమ్ డిజైనర్. సైరా లాంటి హిస్టారికల్ మూవీకి కాస్ట్యూమ్స్ ఎంపిక చేయడం పెద్ద భాద్యతే. 

తన సోదరుడు రాంచరణ్ గురించి సుస్మిత మాట్లాడుతూ.. చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు.కాస్ట్యూమ్స్ బెస్ట్ డిజైన్ వచ్చేవరక ఒప్పుకునేవాడు కాదు. కాస్ట్యూమ్స్ విషయంలోనే కాదు సన్నివేశాలు, నటన విషయంలో కూడా చరణ్ చాలా కేర్ తీసుకునేవాడు. బెస్ట్ అవుట్ ఫుట్ కోసం చరణ్ కొన్ని సందర్భాల్లో నాన్నగారితోనే గొడవపడేవాడు. 

కొన్ని సందర్భాల్లో నాన్ని ఎలాగైనా ఒప్పించాలని నా సాయం కోరేవాడు. మెగాస్టార్ ని ఒప్పించడం కష్టం అని తాను తప్పించ్చుకున్నట్లు సుస్మిత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.