Asianet News TeluguAsianet News Telugu

సమంతతో రొమాన్స్ చేయనుంటున్నాడట చై.. ఎందుకో..?

  • మరో నెల రోజుల్లో ఒక్కటి కాబోతున్న సమంచ, నాగచైతన్య
  • అక్టోబర్ 6న అక్కినేని వారింటి పెళ్లి సందడి
  • తర్వాత మారుతితో చైతూ చేయనున్న సినిమాలో సమంతను వద్దన్న చైతూ
chaitanya akkineni rejected samantha for on screen romance

టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ లవర్స్ ఎవరంటే చైతూ-సమంతలే. ఈ జంట అక్టోబర్ లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తానని ఇప్పటికే చెప్పేయగా చైతు కూడా దానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టడట. అయితే నాగ చైతన్య మాత్రం ఏ హీరోయిన్ తో అయినా నటిస్తా గాని సమంతతో మాత్రం వద్దని చెబుతున్నాడట.

 

సమంతను పెళ్లైతే చేసుకుంటాడు గాని ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి మాత్రం వెనకడుగు వేస్తున్నాడట. రీసెంట్ గా వీరిద్దరు కలిసి నటించే ప్రపోజల్ అయితే ఖచ్చితంగా వచ్చిందని... కాని చైతూ మాత్రం సుముఖంగా లేడని ముమ్మర ప్రచారం సాగుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం చిత్రాల్లో నటించారు. వాస్తవానికి వీరి మధ్య ప్రేమ చిగురించడానికి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా కారణమే.  

 

ప్రస్థుతం చైతూ 'యుద్ధం శరణం'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తర్వాత చందూ మొండేటి డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటించనున్నాడు. దీనికి 'సవ్వసాచి' అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. తర్వాత మారుతి డైరెక్షన్ లో నటించనున్నాడని తెలుస్తుంది. మారుతి సినిమా కోసమే సమంతను తీసుకుందామంటే చైతూ నో చెప్పాడట. మరి తనకు కాబోయే భార్యతో నటించేందుకు ఎందుకు నిరాకరిస్తున్నాడో చైతూకే తెలియాలి. 

 

రారండోయ్ వేడుక చూద్దాంతో  ఈ ఏడాది సక్సెస్ అందుకున్న నాగ చైతన్య.. యుద్ధం శరణం సినిమా ఆ హిట్ సినిమా సరసన చేరుతుందని నమ్మకంగా చెబుతున్నాడు. సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ గా నటించగా లావణ్య త్రిపాఠి హీరోయిన్.

Follow Us:
Download App:
  • android
  • ios