బిగ్‌బాస్‌ 4 మూడో వారం ఉత్కంఠత మధ్య దేవి నాగవల్లి ఎలిమినేట్‌ అయ్యారు. ఊహించని విధంగా ఆమె ఎలిమినేట్‌ కావడం అందరిని బాధించింది. 

ఇక నాలుగో వారంలోకి బిగ్‌బాస్‌ 4 అడుగుపెట్టింది. సోమవారం 22 రోజు రెగ్యులర్‌గా మార్నింగ్‌ సాంగ్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత కంటెస్టెంట్స్ మధ్య గేమ్‌ సాగింది. మొదటగా స్వాతి దీక్షిత్‌, అభిజిత్‌ మధ్య ఫస్ట్ రొమాంటిక్‌ సీన్‌, ఆ తర్వాత విషాద సన్నివేశం స్వాతి చేసి అందరిని ఏడిపించింది.

ఆ తర్వాత నోయల్‌, లాస్య మధ్య గొడవ సీన్‌.. నిజమైన గొడవని తలపించింది. నోయల్‌పై లాస్య ఫైర్‌ అయి అందరిని షాక్‌కి గురి చేసింది.

బామ్మ, మనవడిగా గంగవ్వ, అవినాష్‌ మధ్య పెళ్ళికి సంబంధించి గొడవ జరిగింది. ఇందులో అవినాష్‌ని గంగవ్వ చితక్కొట్టడం హైలైట్‌గా నిలిచింది. బామ్మ చెప్పిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాననేంత వరకు కొట్టింది.

ఈ ఎపిసోడ్‌ తర్వాత దివి‌, మెహబూబ్‌ మధ్య గుసగుసలు జరిగాయి. వీరిద్దరి మధ్య ఇంకేదో జరుగుతుందనే కలర్‌ ఇచ్చారు.

మధ్యాహ్నం అరియానా, అవినాష్‌ ఈక్వెషన్‌ డిస్కషన్‌ , అందులో సోహైల్‌ ఉండటం, అవినాష్‌తో తన కెమిస్ట్రీ సెట్‌ కాదు అని అరియానా చెప్పడం విశేషం. అవినాష్‌ తనకు అలాంటి ఫీలింగ్‌ లేదని.. అందరు బ్రదర్స్ లాంటి వారన్నారు. మరి అందరు సిస్టర్సేనా అన అడగ్గా అది మాత్రం కాదన్నారు.  

ఇక అవినాష్‌, మోనాల్‌ మధ్య కిచెన్‌ వద్ద చోటు చేసుకున్న కామెడీ కడుపుబ్బ నవ్వించింది.  అభిజిత్‌,  దివి మధ్య ఇంకా ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. బేసిక్‌గా హౌజ్‌లో ప్రధానంగా పులిహోర కలిపే బ్యాచ్‌గా అభిజిత్‌ కి ఉంది. దాన్ని దివితో కలిసి మరింత పెంచాడు అభిజిత్‌. 

సోహైల్‌, అఖిల్‌కి బిగ్‌బాస్‌ స్టోర్‌ రూమ్‌లో ఉన్న డిటెక్టివ్‌ డ్రెస్‌ వేసుకోమని చెప్పారు. `ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ` చిత్రంలోని హీరో గెటప్‌ మాదిరిగా వీరిద్దరు ముస్తాబయ్యారు. 

డిటెక్టివ్‌లుగా అఖిల్‌, సోహైల్‌ కలిసి అరియానా, లాస్య, అవినాష్‌ తదితరులను ఇంటరాగేషన్‌ చేశారు. హిట్‌ మెన్లని వెలికి తీసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇది పరోక్షంగా ఎలిమినేషన్‌కి నామినేషన్‌ ప్రక్రియ. 

ఆ తర్వాత బిగ్‌బాస్‌ నాలుగో వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయిన వారి పేర్లని వెల్లడించాడు. స్వాతి దీక్షిత్‌, అభిజిత్‌, లాస్య, కుమార్‌ సాయి, మెహబూబ్‌, సోహైల్‌, హారిక నామినేట్‌ అయ్యారు. అయితే డిటెక్టీవ్‌ గేమ్‌లో తన వద్ద అత్యధిక డబ్బు ఉన్న కారణంగా అఖిల్‌ సేవ్‌ అయ్యారు.  మరి నామినేట్‌ అయిన ఏడుగురిలో ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో చూడాలి.