Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2 గ్రాండ్ ఫినాలే: బోలెడంత ఎమోషన్!

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం నాడు ఎంతో ఎమోషనల్ గా సాగింది. తనీష్, గీతామాధురి, సామ్రాట్,  దీప్తి నల్లమోతు, కౌశల్ లు ఫైనల్ కి చేరుకోవడంతో టైటిల్ పోరు రసవత్తరంగా సాగింది. 

bigg boss2: grand finale episode highlights
Author
Hyderabad, First Published Sep 30, 2018, 9:46 PM IST

బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం నాడు ఎంతో ఎమోషనల్ గా సాగింది. తనీష్, గీతామాధురి, సామ్రాట్, దీప్తి 
నల్లమోతు, కౌశల్ లు ఫైనల్ కి చేరుకోవడంతో టైటిల్ పోరు రసవత్తరంగా సాగింది. నాని కెరీర్ లో సూపర్ హిట్ మెడ్లీ పాటలకి డాన్స్ చేశాడు నాని. షోని 113 రోజులుగా అధ్బుతంగా ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నాని.

ఆ తరువాత షో చూడడానికి వచ్చిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ తో మాట్లాడాడు నాని. ముందుగా గీతామాధురి తల్లితో మాట్లాడాడు. తరువాత సామ్రాట్ తల్లి తండ్రులతో మాట్లాడుతూ.. సామ్రాట్ ని ఈ హౌస్ లో చూడటం ఎలా ఉందని అడగగా.. సంతోషంగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నారు సామ్రాట్ తండ్రి. అనంతరం తనీష్ తల్లితో మాట్లాడారు నాని. ఆ సమయంలో ఆమె ఎమోషనల్ అయ్యారు. 

''తనీష్ ఫాథర్ చనిపోయిన ఏడాదికి బిగ్ బాస్ హౌస్ నుండి ఫోన్ వచ్చిందని వెళ్లనా.. అమ్మ అని తనీష్ అడిగాడు'' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తరువాత కౌశల్ భార్య 
నీలిమతో మాట్లాడగా.. ఆమె ''బిగ్ బాస్ షో వల్ల కౌశల్ ఏంటో జనానికి తెలిసిందని'' అన్నారు. హౌస్ లో ఉన్న ఐదుగురు సభ్యులని వారి కుటుంబ సభ్యులని చూపించి ఎమోషనల్ టచ్ ఇచ్చారు.

అనంతరం ఎలిమినేషన్ మొదలుపెట్టిన నాని... ముందుగా సామ్రాట్ ని హౌస్ నుండి బయటకి రమ్మని చెప్పారు. ముందుగానే ఊహించిన సామ్రాట్ నవ్వుతూనే బయటకి వచ్చేశాడు. స్టేజ్ పైకి వచ్చిన సామ్రాట్.. నానితో కాసేపు మాట్లాడి అతడితో సెల్ఫీ దిగి తన తల్లితండ్రులని హత్తుకున్నాడు. సామ్రాట్ ఎలిమినేట్ అయిన తరువాత నందిని, తేజస్వి, దీప్తి సునైనా, శ్యామలలు డాన్స్ చేసి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. 

ఆ తరువాత హౌస్ లో ఉన్న నలుగురి సభ్యుల్లో దీప్తి ఎలిమినేట్ అయినట్లు నాని ప్రకటించారు. ఆమె ఎలిమినేట్ అయిన కొద్దిసేపటికే ఓ చిన్న గేమ్ ఆడించి తనీష్ ఎలిమినేట్ 
అయినట్లు తెలిపారు. ఇక హౌస్ లో మిగిలిన కౌశల్, గీతామాధురిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగింది. ఫైనల్స్ కి చేరుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ కౌశల్, గీతాల కోసం హౌస్ లోకి వెళ్లారు నాని.

హౌస్ మొత్తం తిరుగుతూ.. వాళ్ల ఫీలింగ్స్ ని అడిగి తెలుసుకున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో పడుకున్నప్పుడు కుక్కలు మొరిగినది మళ్లీ వినాలని ఉందంటూ గీతా మాధురి కోరడంతో నానితో పాటు కౌశల్, గీతలు పడుకున్నట్టు నటించారు. దీంతో కుక్కలు మొరిగాయి. అనంతరం బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఇద్దరు ఫైనలిస్ట్‌లను హౌస్ నుండి బయటకు తీసుకుని స్టేజ్ మీదికి వచ్చారు నాని.

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ విజేతని ప్రకటించడానికి స్టేజ్ పైకి వచ్చారు విక్టరీ వెంకటేష్. ఇక బిగ్ బాస్ విన్నర్ ప్రకటించేద్దామా అని నాని అనడంతో కంగారు వద్దమ్మా అని తనదైన శైలి డైలాగ్ డెలివరీతో నాని హోస్ట్‌గా బిగ్ బాస్ జర్నీని వీడియో ప్లే చేయాల్సిందిగా ఆదేశించారు నాని. 5 నిమిషాల పాటు సాగిన ఈ వీడియోలో నాని హోస్ట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో గడిపిన ఫన్నీ మూమెంట్స్‌ను ప్లే చేశారు. ఆ తరువాత అందరూ ఊహించినట్లుగానే నాని టీవీ ద్వారా బిగ్ బాస్ విజేత కౌశల్ అంటూ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ కారు వద్ద అభిమానుల నినాదాలు!

బిగ్ బాస్2: విజేతగా నిలిచిన కౌశల్.. వెంకటేష్ చేతుల మీదుగా ట్రోఫీ!

ఫైనల్ విన్నర్ ను ముందే తేల్చేసిన నాని

బిగ్ బాస్2: సైరన్ మోగింది.. తనీష్ లాక్ అయ్యాడు!

బిగ్ బాస్2: దీప్తి ఔట్!

బిగ్ బాస్2: ఫైనల్స్ కి ఫస్ట్ వెళ్లిన సామ్రాట్ అవుట్!

బిగ్ బాస్2: ఎమోషనల్ అయి ఏడ్చేసిన కౌశల్!

బిగ్ బాస్2: హౌస్ లోకి వచ్చి కౌశల్ ఆర్మీపై కామెంట్స్ చేసిన తేజస్వి!

బిగ్ బాస్2: నూతన్ నాయుడు రాకపోవడానికి కారణం..?

బిగ్ బాస్ 2: ఒక సాధారణ సీరియల్ నటుడే 'స్టార్ మా'కు దేవుడయ్యాడు!

బిగ్ బాస్2: హౌస్ లో అవార్డుల సందడి.. ప్రవచన్ బాబా @ కౌశల్!

బిగ్ బాస్2: కౌశల్ చేతిలో బిగ్ బాస్ ట్రోఫీ..

బిగ్ బాస్2: విజేతని ప్రకటించేదెవరంటే..

 

Follow Us:
Download App:
  • android
  • ios