Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: విజేతగా నిలిచిన కౌశల్.. వెంకటేష్ చేతుల మీదుగా ట్రోఫీ!

బిగ్ బాస్ సీజన్2 గ్రాండ్ ఫినాలేకి ఐదుగురు కంటెస్టెంట్స్ చేరుకోగా ఇప్పటివరకు సామ్రాట్, దీప్తి నల్లమోతు, తనీష్ లు బయటకి వచ్చేశారు. హౌస్ లో మిగిలింది ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే.. 

bigg boss2: kaushal is the winner of bigg boss show
Author
Hyderabad, First Published Sep 30, 2018, 8:45 PM IST

బిగ్ బాస్ సీజన్2 గ్రాండ్ ఫినాలేకి ఐదుగురు కంటెస్టెంట్స్ చేరుకోగా ఇప్పటివరకు సామ్రాట్, దీప్తి నల్లమోతు, తనీష్ లు బయటకి వచ్చేశారు. హౌస్ లో మిగిలింది ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే.. వారే కౌశల్, గీతామాధురి. వీరిద్దరిలో విజేతను ప్రకటించే ముందు హోస్ట్ నాని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరితో కూర్చొని హౌస్ లో వారి జర్నీని వీడియో రూపంలో చూపించారు.

ఈ వీడియో చూసిన హౌస్ మేట్స్ అందరితో పాటు ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అయ్యారు. కంటెస్టెంట్స్ గా పాల్గొన్న ప్రతిఒక్కరూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం నాని.. హౌస్ లో ఉన్న కౌశల్, గీతామాధురిలను ప్రత్యేకంగా ఇంటి నుండి బయటకి తీసుకురావడానికి హౌస్ లోకి వెళ్లారు. కొంతసమయం వారితో ముచ్చటించారు. వారిద్దరి చేతులు పట్టుకొని హౌస్ నుండి స్టేజ్ మీదకి తీసుకొచ్చారు.

వీరిద్దరిలో విజేతని ప్రకటించడానికి అతిథిగా విక్టరీ వెంకటేష్ వచ్చారు. అందరూ ఊహించినట్లుగానే కౌశల్ బిగ్ బాస్ 2 టైటిల్ ని దక్కించుకున్నారు. వెంకటేష్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న కౌశల్ ఆనందానికి అవధుల్లేవు. 

అనంతరం కౌశల్ మాట్లాడుతూ.. ''జీరో తో హైదరాబాద్ లో అడుగుపెట్టాను.. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈ స్టేజ్ కి వచ్చాను. నాలో కసి పెంచిన కంటెస్టెంట్స్ అందరికీ థాంక్స్.. నేను గెలిచిన ఈ విజయాన్నిప్రేక్షకులకు అంకితం చేస్తున్నాను.. మా అమ్మ గారు క్యాన్సర్ తో చనిపోయారు. షో ద్వారా నేను గెలిచిన ఈ డబ్బుని క్యాన్సర్ బాధితులకు వినియోగిస్తాను'' అంటూ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

ఫైనల్ విన్నర్ ను ముందే తేల్చేసిన నాని

బిగ్ బాస్2: సైరన్ మోగింది.. తనీష్ లాక్ అయ్యాడు!

బిగ్ బాస్2: దీప్తి ఔట్!

బిగ్ బాస్2: ఫైనల్స్ కి ఫస్ట్ వెళ్లిన సామ్రాట్ అవుట్!

బిగ్ బాస్2: ఎమోషనల్ అయి ఏడ్చేసిన కౌశల్!

బిగ్ బాస్2: హౌస్ లోకి వచ్చి కౌశల్ ఆర్మీపై కామెంట్స్ చేసిన తేజస్వి!

బిగ్ బాస్2: నూతన్ నాయుడు రాకపోవడానికి కారణం..?

బిగ్ బాస్ 2: ఒక సాధారణ సీరియల్ నటుడే 'స్టార్ మా'కు దేవుడయ్యాడు!

బిగ్ బాస్2: హౌస్ లో అవార్డుల సందడి.. ప్రవచన్ బాబా @ కౌశల్!

బిగ్ బాస్2: కౌశల్ చేతిలో బిగ్ బాస్ ట్రోఫీ..

బిగ్ బాస్2: విజేతని ప్రకటించేదెవరంటే..?

Follow Us:
Download App:
  • android
  • ios