Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 2: ఒక సాధారణ సీరియల్ నటుడే 'స్టార్ మా'కు దేవుడయ్యాడు!

మొత్తానికి ఫైనల్ రోజు రానే వచ్చింది. విజేతగా ఎవరు నిలుస్తారోఇప్పటికే చాలా మందికి ఒక క్లారిటీ వచ్చింది. ఆ సంగతి పక్కనపెడితే కౌశల్ హౌస్  లోకి వచ్చిన తరువాత చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. అప్పటివరకు ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా మొహం చుస్తే గాని కౌశల్ అంటే ఎవరో తెలియని పరిస్థితి. 

kaushal important role on big boss 2 rating
Author
Hyderabad, First Published Sep 30, 2018, 12:27 PM IST

రియాలిటీ షోలకు అర్ధాన్నే మార్చేసిన బిగ్ బాస్ రెండవ సీజన్ కూడా ఆసక్తికరంగా ముందుకు సాగింది. మొదటి సీజన్ లో తారక్ అండతో షోకి మంచి రేటింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్ సీజన్ లో నాని కూడా పరవాలేదు అనిపించే విధంగా చేశాడు. మొదట్లో సెకండ్ సీజన్ పై కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ హౌస్ లో జరిగే పరిణామాలే షోకి మంచి గుర్తింపు తెచ్చాయి. 

ఇక మొత్తానికి ఫైనల్ రోజు రానే వచ్చింది. విజేతగా ఎవరు నిలుస్తారోఇప్పటికే చాలా మందికి ఒక క్లారిటీ వచ్చింది. ఆ సంగతి పక్కనపెడితే కౌశల్ హౌస్  లోకి వచ్చిన తరువాత చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి. అప్పటివరకు ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా మొహం చుస్తే గాని కౌశల్ అంటే ఎవరో తెలియని పరిస్థితి. కానీ హౌస్ లో అతని బిహేవియర్ చూసిన తరువాత చాలా మంది అతనికి మద్దతు పలికారు. దెబ్బకు బిగ్ బాస్ 2 రేటింగ్ లో చాలా మార్పులు వచ్చాయి. 

మొదట్లో శని ఆదివారాల్లో నాని స్టార్ డామ్ తో ఛానెల్ కి రేటింగ్ వచ్చేది. కానీ కొన్ని రోజుల వరకు మిగతా రోజుల్లో పరిస్థితి కొంచెం సందేహాగానే ఉండేది. కానీ కౌశల్ వల్ల కొన్ని రోజులకే మళ్ళీ ఛానెల్ టిఆర్పి ఊపందుకుంది. ఎక్కువగా అతనిపై ఫోకస్ చేసి షో స్థాయిని పెంచారు. ఒక సాధారణ సీరియల్ ఆర్టిస్ట్ కారణంగా షోని సక్సెస్ ఫుల్ గా ముగిస్తున్నారని చెప్పవచ్చు.     

ఇక కౌశల్ ఎఫెక్ట్ వల్లే చాలా మంది ఎలిమినేట్ అయ్యారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కౌశల్ ఆర్మీ లో రోజురోజుకి ఎంతో మంది ఫాలోవర్స్ పెరగడం చూస్తూనే ఉన్నాం. ముందుగా కౌశల్ ఎదో గ్రూప్ సపోర్ట్ సెట్ చేసుకున్నప్పటికీ సాధారణ జనులే అతని ఆర్మీలో మరింత బలపరిచారు,   

Follow Us:
Download App:
  • android
  • ios