బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం ఎపిసోడ్ తో పూర్తి కానుంది. దీంతో హౌస్ లో సందడి మరింత ఎక్కువైంది. శుక్రవారం నాడు హౌస్ లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ తీసుకొచ్చారు. నూతన్ నాయుడు తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ కి వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. 

బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం ఎపిసోడ్ తో పూర్తి కానుంది. దీంతో హౌస్ లో సందడి మరింత ఎక్కువైంది. శుక్రవారం నాడు హౌస్ లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ తీసుకొచ్చారు. నూతన్ నాయుడు తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ హౌస్ కి వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. శనివారం ఎపిసోడ్ లో రోల్ రైడా, అమిత్ లు యాంకర్లుగా మారి బిగ్ బాస్ హౌస్ ని పార్టీ హౌస్ గా మార్చేశారు.

ముందుగా గీతామాధురి పాటలతో హౌస్ లో అందరూ డాన్స్ లు చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత హౌస్ మేట్స్ అందరికీ బిగ్ బాస్ ఇచ్చిన ప్రశ్నలని అడిగి ర్యాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహించారు. అనంతరం కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ వారి పెర్సనాలిటీకి తగ్గట్లు అవార్డుల లిస్ట్ ని ఇచ్చారు. ఎవరెవరు ఏ ఏ అవార్డులు దక్కించుకున్నారో చూద్దాం..

అయోమయం - కిరీటీ 
పక్కా మాస్ - శ్యామల 
ఆశాకిరణం - పూజా రామచంద్రన్ 
గానకోకిల - గీతామాధురి 
మిర్చి - భానుశ్రీ 
మిస్టర్ రోమియో - సామ్రాట్ 
ఎంటర్టైనర్ - తేజస్వి 
కాకరకాయ - దీప్తి 
నిద్రబోతు - దీప్తి సునైనా 
ప్రవచన్ బాబా - కౌశల్ 
క్లాసీ - సామ్రాట్ 
సర్వజ్ఞాని - బాబు గోగినేని 
తిండిబోతు - గణేశ్ 
బద్దకం - దీప్తి సునైనా 
ఆవేశపరుడు - తనీష్
లౌడ్ స్పీకర్ - సంజనా అన్నే 
డ్రామా క్వీన్ - దీప్తి నల్లమోతు
దివా - నందిని రాయ్ 
పని దొంగ - రోల్ రైడా 
ఫుటేజ్ కింగ్ - అమిత్ తివారీ 
ఈ అవార్డుల హడావిడి పూర్తయిన తరువాత రోల్ రైడా తన పాటలతో హౌస్ మేట్స్ అందరినీ ఎంటర్టైన్ చేశాడు.