Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్2: సైరన్ మోగింది.. తనీష్ లాక్ అయ్యాడు!

బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ షో సీజన్ 2 నేటి ఎపిసోడ్ తో ముగియనుంది. తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ విజేతను ప్రకటించే సమయం కూడా వచ్చేసింది.

bigg boss2: tanish eliminated
Author
Hyderabad, First Published Sep 30, 2018, 8:14 PM IST

బుల్లితెర నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ షో సీజన్ 2 నేటి ఎపిసోడ్ తో ముగియనుంది. తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ విజేతను  ప్రకటించే సమయం కూడా వచ్చేసింది. గ్రాండ్ ఫినాలేకి చేరుకున్న ఐదుగురు కంటెస్టెంట్ లలో ఇప్పటికే సామ్రాట్, దీప్తిలు బయటకి వచ్చేశారు. సామ్రాట్ ఎలిమినేషన్ తరువాత నందిని, తేజస్వి, దీప్తి సునైనా, శ్యామల తమ డాన్సులతో స్టేజ్ ని షేక్ చేశారు.

ఇక దీప్తి నల్లమోతు టాప్ 2 లో ఉంటుందనుకుంటే ఆమె బయటకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె ఎలిమినేట్ అయిన తరువాత అమెరికా నుండి వచ్చిన బిగ్ బాస్ షో అభిమానులు స్టేజ్ మీద బిగ్ బాస్ షోని వివరిస్తూ.. కంటెస్టెంట్స్ ని పొగుడుతూ ఓ పాటకి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అనంతరం నాని హౌస్ లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్స్ తనీష్, గీతామాధురి, కౌశల్ తో మాట్లాడుతూ ముగ్గురినీ ముందుగా సెల్ఫీ తీసుకోమని చెప్పారు.

ఆ తరువాత ముగ్గురిలో ఒకరిని కన్సెషన్ రూమ్ లోకి, మరొకరిని స్మోకింగ్ రూమ్ లోకి మరొకరిని వేరే చోటుకి పంపించి సైరన్ మోగిన తరువాత బయటకి రమ్మని చెప్పారు. ఎవరి డోర్ ఓపెన్ అవుతుందో వారు ఫైనల్స్ కి చేరుకుంటారని చెప్పారు. ఈ ఆటలో కౌశల్, గీతామాధురిల డోర్లు ఓపెన్ అయ్యాయి. సో.. తనీష్ హౌస్ నుండి బయటకి  వచ్చేశాడు. 

సంబంధిత వార్తలు

బిగ్ బాస్2: దీప్తి ఔట్!

బిగ్ బాస్2: ఫైనల్స్ కి ఫస్ట్ వెళ్లిన సామ్రాట్ అవుట్!

బిగ్ బాస్2: ఎమోషనల్ అయి ఏడ్చేసిన కౌశల్!

బిగ్ బాస్2: హౌస్ లోకి వచ్చి కౌశల్ ఆర్మీపై కామెంట్స్ చేసిన తేజస్వి!

బిగ్ బాస్2: నూతన్ నాయుడు రాకపోవడానికి కారణం..?

బిగ్ బాస్ 2: ఒక సాధారణ సీరియల్ నటుడే 'స్టార్ మా'కు దేవుడయ్యాడు!

బిగ్ బాస్2: హౌస్ లో అవార్డుల సందడి.. ప్రవచన్ బాబా @ కౌశల్!

బిగ్ బాస్2: కౌశల్ చేతిలో బిగ్ బాస్ ట్రోఫీ..

బిగ్ బాస్2: విజేతని ప్రకటించేదెవరంటే..?

 

Follow Us:
Download App:
  • android
  • ios