బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ కౌశల్ కి ఎంతటి ప్రేక్షకాదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడే విజేత కావాలని రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాదు.. విదేశాల నుండి కూడా భారీ సంఖ్యలో ఓట్లు వేశారు.
బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ కౌశల్ కి ఎంతటి ప్రేక్షకాదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడే విజేత కావాలని రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాదు.. విదేశాల
నుండి కూడా భారీ సంఖ్యలో ఓట్లు వేశారు.
వారు ఆశించిన విధంగానే కౌశల్ విజేతగా నిలిచారు. అయితే ఆదివారం ఫినాలే ఎపిసోడ్ కి కౌశల్ అభిమానులు దాదాపు 300 మండి అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. కౌశల్, కౌశల్ అంటూ వారు చేసిన నినాదాల వల్ల షోకి కూడా కొద్దిసేపు ఆటంకం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే కౌశల్ ని విజేతగా ప్రకటించిన తరువాత మొత్తం షో పూర్తయి అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకి వెళ్తోన్న కౌశల్ కారు చుట్టూ గుమ్మిగూడిన అభిమానులు కౌశల్, కౌశల్ అంటూ నినాదాలు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Scroll to load tweet…
Scroll to load tweet…
