బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకి చేరుకుంది. ఆదివారంతో ఈ షో ముగుస్తుండడంతో విజేతగా ఎవరు గెలవనున్నారనే విషయంపై ఆసక్తి పెరిగిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో విజేత ఎవరనే విషయం తెలియనుంది. కౌశల్, సామ్రాట్, తనీష్, దీప్తి, గీతామాధురిలు ఫైనల్స్ కి చేరుకోగా.. వారిలో కౌశల్ గెలుస్తాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే కౌశల్ కి పోటీగా దీప్తి కూడా ఉంటుందని అంటున్నారు. గ్రాండ్ ఫినాలేకి అతిథిగా ఎవరోస్తారనే విషయంపై నాగార్జున, ఎన్టీఆర్ ల పేర్లు వినిపించాయి. ఇప్పటికే నాగార్జున 'దేవదాస్' సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ షోకి వచ్చారు. 

అలానే ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆయన అతిథిగా వచ్చే అవకాశాలు లేవు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ షోకి అతిథిగా వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. 'అరవింద సమేత' రిలీజ్ కి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో చిత్రబృందం పనుల్లో తలమునకలై ఉన్నారు.

కాబట్టి ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. తాజాగా వినిపిస్తోన్న వార్తల ప్రకారం ఫినాలేకి చీఫ్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ రాబోతున్నారట. ఆయనే టైటిల్ విజేతని ప్రకటిస్తారని అంటున్నారు. ముఖ్య అతిథిగా ఆయన స్పీచ్ కూడా ఇవ్వబోతున్నాడట. బిగ్ బాస్ విజేతగా నిలిచిన వారికి రూ.50 లక్షల నగదు బహుమతి దక్కనుంది!