Asianet News TeluguAsianet News Telugu

నెలకి వంద రూపాయలు పంపండి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్షల మంది కౌశల్ ని అభిమానిస్తూ తమ ప్రేమని తెలియజేస్తున్నారు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కౌశల్ షోరూమ్ ఓపెనింగ్స్, మోడలింగ్ ఏజెన్సీ పనులతో బిజీగా గడుపుతున్నాడు. 

bigg boss winner kaushal request to his fans
Author
Hyderabad, First Published Nov 1, 2018, 11:53 AM IST

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్షల మంది కౌశల్ ని అభిమానిస్తూ తమ ప్రేమని తెలియజేస్తున్నారు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కౌశల్ షోరూమ్ ఓపెనింగ్స్, మోడలింగ్ ఏజెన్సీ పనులతో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ఆయన అనంతపురంలో అభిమానులు ఏర్పాటు చేసిన విజయోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ని మొదలుపెట్టినట్లు దాన్ని దేశంలోనే బెస్ట్ ఎన్జీవోగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్లు తన కోరికని వెల్లడించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నట్లు దానికి ప్రతీ ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.

మరిన్ని విషయాలను మాట్లాడుతూ.. ''ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించి కౌశల్ ఆర్మీ పేరుతో చాలా మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వారిని కాపాడినట్లు విన్నాను. ఇలాంటివి ఏమున్నా.. మన ఫౌండేషన్ ద్వారా కాపాడటం జరుగుతుంది. ఫౌండేషన్ మొదలుపెట్టిన రెండో రోజే ఓ అభిమాని వచ్చి తన బాబాయ్ కి లివర్ సమస్య ఉందని డొనేషన్ అడిగాడు.

అప్పుడే మొదలుపెట్టిన మన ఫౌండేషన్ కి అన్ని నిధులు రాలేదు. కాబట్టి మీరంతా కూడా నెలకి వంద రూపాయలు ఇస్తే మన వాళ్లని కాపాడుకోవచ్చు. భవిష్యత్తులో మరింత మందిని కాపాడుకోవచ్చు'' అంటూ వెల్లడించాడు. 

ఇవి కూడా చదవండి.. 

రాజకీయాల్లోకి కౌశల్: జనసేనలో చేరుతారా...

వేలానికి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దుస్తులు!

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

ఇప్పటికీ కౌశల్ ఎఫెక్ట్.. పాపం తనీష్ అదే స్దితిలో..?

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

Follow Us:
Download App:
  • android
  • ios