నటిగా టాలీవుడ్ లో రాణించిన వితిక ఆ తర్వాత కొంత కాలానికి హీరో వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరూ జంటగా ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నారు. వితిక దాదాపు 3 నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో రాణించింది. వరుణ్ సందేశ్ టాప్ 4 గా నిలిచాడు. 

బిగ్ బాస్ హౌస్ లో, వితిక, వరుణ్ మధ్య అన్యోన్యతని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. చీటికీ మాటికి వరుణ్ పై అలగడం.. ఆతర్వాత వరుణ్ వచ్చి వితికని బుజ్జగించడం లాంటి సంఘటనలు బిగ్ బాస్ లో చాలానే జరిగాయి. హౌస్ లో ఉన్నన్ని రోజులు వితిక యాక్టీవ్ గా అన్ని టాస్క్ లలో పాల్గొంది. తాజాగా వితిక ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 

కొన్నేళ్ల క్రితం వితిక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించిందంటూ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఆ సంఘటనపై వితిక మరోసారి స్పందించింది. ఆరోజు తాను నిద్రమాత్రలు తీసుకున్న సంగతి వాస్తవమే అని వితిక పేర్కొంది. 

RRRలో విలన్ గా 53 ఏళ్ళ ఐరిష్ నటి.. కీలక పాత్రలో మరో నటుడు?

అంతకు ముందు నేను దాదాపు 6 ఏళ్ళు అమెరికాలో గడిపి వచ్చా. ఇండియాకు వచ్చిన తర్వాత సరిగ్గా నిద్ర పట్టేది కాదు. చాలా ఇబ్బంది పడ్డా. మా అసిస్టెంట్ ని పంపి నిద్రమాత్రలు తెప్పించుకున్నా. మొదట ఒక మాత్ర వేసుకుని ట్రై చేశా. నిద్రపట్టలేదు. రెండు మాత్రలు వేసుకున్నా అయినా నిద్ర రాలేదు. ఇక ఇలా కాదని మరో రెండు వేసుకున్నా. ఆరోజు రాత్రి 1 గంటకు నిద్ర పట్టింది. 

ఉదయాన్నే మా అమ్మ నిద్రలేపడానికి ప్రయత్నించింది. బాగా మత్తులో ఉండడం వల్ల మేల్కొనలేదు. దీనితో కుటుంబ సభ్యులు కంగారుపడి ఆసుపత్రికి తరలించారు. నేను వేసుకున్న మాత్రలు కేవలం 0.5 ఎంజి డోస్ ఉన్నవే. కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపేశారు. ఇంతకు మించి ఇంకేమీ జరగలేదు. తాను ఆత్మహత్యకు ప్రయత్నించానంటూ జరిగిన ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వితిక పేర్కొంది.