'RX100' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది కానీ టాలీవుడ్ లో ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. చాలా సినిమాల్లో హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్నప్పటికీ అవకాశం మాత్రం ఇవ్వడం లేదు.

ప్రస్తుతానికి సీనియర్ స్టార్ హీరోలు వెంకటేష్, నాగార్జునలతో సినిమాలు చేస్తుందని మాత్రం వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మరో హీరో సినిమాలో పాయల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. 

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు వంశీకృష్ణ సువర్ట్ పురానికి చెందిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా సినిమా  తీయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంది.

అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ 'రాక్షసన్' సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే వంశీకృష్ణ సినిమాను మొదలుపెట్టనున్నారు.