Asianet News TeluguAsianet News Telugu

బండ్ల గణేష్ ఆరోగ్యం పరిస్థితిపై లేటెస్ట్ అప్ డేట్

కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఆ మధ్యన బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట. దాంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Bandla Ganesh has tested negative for Corona
Author
Hyderabad, First Published Jun 29, 2020, 10:37 AM IST

టాలీవుడ్ లో ఫస్ట్ కరోనా కేసు బండ్ల గణేష్ రూపంలో నమోదు అయిన సంగతి తెలిసిందే. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఆ మధ్యన బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట. దాంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో ప్రస్తుతం బండ్ల గణేష్‌ను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు బండ్ల గణేష్ ..కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయనకు టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. దాంతో ఆయన,కుటుంబ సభ్యులు,సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఇప్పటికీ ఆయన క్వారంటైన్ లోనే ఉన్నారు. ఎవరినీ కలవటం లేదు. టాలీవుడ్ ఇదొక సంతోషకరమైన వార్తగా అభివర్ణిస్తోంది.
 
ఇక బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా  టెస్టులు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.అందరికీ నెగిటివ్ వచ్చింది బండ్ల గణేష్‌కు కరోనావైరస్ అనే విషయం బయటపడగానే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. ఇటీవల ఆయనను ఎవరు కలిశారు..ఆయన‌తో ఎవరు భేటీ అయ్యారు.. అనే కోణంలో అధికారులు తెలుసుకుని టెస్ట్ లు నిర్వహించారు. 
 
ఇదిలా ఉంటే కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీనే కాదు సీరియల్ ఇండస్ట్రీని కూడా వణికిస్తుంది. టివి సీరియల్ ఇండస్ట్రీలో రోజుకు రోజు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా సీరియల్ హీరో హరి కృష్ణ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈయన ఓ ప్రముఖ ఛానల్ లో వస్తోన్న లీడింగ్ సీరియల్ లో హీరోగా నటిస్తున్నారు. దాంతో జరగాల్సిన  ఆ సీరియల్ షూటింగ్ రద్దయ్యింది. ఈ సీరియల్ కి ప్రభాకర్ దర్శక నిర్మాతగా వ్యవరిస్తున్నాడు. ప్రభాకర్ కు ఇంతకముందే కరోనా సోకింది. అతనితో కలిసి తిరిగినందున అనుమానంతో టెస్ట్  చేయించుకున్నాడు హరికృష్ణ. అయితే ఆ పరీక్షలో అతనికి పాజిటివ్ వచ్చింది.  షూటింగ్ లో పాల్గొనే అందరికి ఇన్సూరెన్స్ లు చేయించాలి అని ప్రభుత్వం తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios