Asianet News TeluguAsianet News Telugu

అది `భోళాశంకర్‌` పోస్టరా? షాపింగ్‌ మాల్‌ యాడా?.. చిరు సినిమా పోస్టర్‌పై బాలయ్య ఫ్యాన్స్ ట్రోల్స్.. రచ్చ రచ్చ

చిరంజీవి నటిస్తున్న `భోళా శంకర్‌` సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. కానీ ఈ పోస్టర్‌ని ట్రోల్స్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. 

balakrishna fans trolls on chiranjeevi bhola shankar ugadi poster now its hot topic
Author
First Published Mar 21, 2023, 9:43 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా `భోళాశంకర్‌`. ఈ సంక్రాంతి `వాల్తేర్‌ వీరయ్య` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న సినిమా ఇది. మెహర్‌ రమేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తిసురేష్‌ చిరుకి చెల్లి పాత్ర చేస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం తమిళంలో వచ్చిన `వేదాళం`కి రీమేక్‌. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఉగాది ట్రీట్‌ ఇచ్చింది యూనిట్‌. కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేస్తూ విడుదల తేదీని ప్రకటించారు. ఆగస్ట్ 11న స్వాతంత్ర దినోత్సవ కానుకగా సినిమాని విడుదల చేయనున్నట్టు వెల్లడించింది యూనిట్‌. 

ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. ఇందులో తమన్నా, కీర్తిసురేష్‌ ఇద్దరు సోఫాలో కూర్చోగా, వెనకాల చిరంజీవి నిల్చున్నారు. అయితే ఈ ముగ్గురు కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో మెరిశారు. కీర్తిసురేష్‌ బ్లూ కలర్‌ పట్టు చీరలో మెరిసింది. మెడలో బంగారు అభరణాలు ధరించింది. మరోవైపు తమన్నా ట్రెండీ వేర్‌లో కనిపించింది. కానీ ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపించింది. పింక్‌ డ్రెస్‌లో ఆకట్టుకుంటుంది. వెనకాల గ్రీన్‌ కలర్‌ షర్ట్ ధరించి కూల్‌ గ్లాసెస్‌ పెట్టుకుని స్టయిల్‌గా నిల్చున్నాడు చిరజీవి. ఈ పోస్ట్ ఆకట్టుకుంది. 

అయితే ఇప్పుడు ఈ పోస్టర్‌ ట్రోల్స్ కి గురవుతుంది. కొందరు నెటిజన్లు దీన్ని షాపింగ్‌ మాల్‌ యాడ్‌గా మార్చి ట్రోల్స్ చేస్తున్నారు. కొత్త పోస్టర్‌ `సీఎంఆర్‌` షాపింగ్‌ మాల్‌ యాడ్‌లా ఉందని, మరికొందరు చందనా బ్రదర్స్ సిల్క్ సెంటర్‌లా ఉందని పోస్టర్ల డిజైన్‌ మార్చి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. వీరు ఆయా షాపింగ్‌ మాల్స్ కి యాడ్‌ చేస్తున్నట్టుగా, ప్రమోటర్‌గా ఉన్నారని వెటకారంగా పోస్ట్ లు పెడుతుండటం గమనార్హం. 

అయితే వీరిలో ఎక్కువగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు. వారే ఇలా పోస్టర్‌ని యాడ్‌లా మార్చి సామాజిక మాధ్యమాలలో రచ్చ చేస్తున్నారు. బాసు కొత్త యాడ్‌ అని, ఏంటీ బాసూ ఇలా అయిపోయావ్‌, అంటూ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అంతేకాదు లేనిపోని బ్రాండ్ల షాపింగ్‌ మాల్స్ పేర్తు కూడా జోడించి ఆడుకుంటున్నారు. దీంతో ఇది సామాజిక మాధ్యమాల్లోవైరల్‌గా, హాట్‌ టాపిక్‌గా మారింది. మరి దీనిపై మెగా ఫ్యాన్స్ రియాక్షన్‌ ఏంటనేది చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios